మీ ఆరొగ్యానికి మొలకలు

0
370

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

మీ ఆరొగ్యానికి మొలకలు!!!
*****************
గజిబిజి పరుగులు, బిజీ బిజీ బ్రతుకులతో అనుక్షణం యాంత్రిక జీవితాన్ని అలవర్చుకుంటున్న తరుణంలో ఆరోగ్య సమస్యలూ ఎన్నో… ఇందులో ప్రధనంగా అసమతుల్య ఆహారపు అలవాట్లతో స్థూలకయ సమస్య ఏర్పదుతుంది. ఈ సమస్య ప్రతివారిలోనూ ఆందోళనను రేకెత్తిస్తుంది. దీనిని అధిగమించాలని మనసులో ఉన్నా ఆచరణలో పెట్టలేకపోతున్నారు. మనముందున్న తేలికైన మార్గం మొలకలని ఆహారంగా స్వీకరించడం. మరి మొలకలు అందించే ఆరోగ్య వరాలేమిటో తెలుసుకుందామా…..
పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు… ఇలా ఎన్నో…. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.  మొలకల వల్ల అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి.  కేలరీలు పెరగవు. మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. సన్నగా, నాజూకుగా మీ శరీరం మారాలనుకుంటే మొలకలే ఆరోగ్యం. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్, సోయాగింజలు, బ్రకోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కలిగివున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము…
1. సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన గింజలలో విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.

2. మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి.

3. అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు. నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కొలెస్టరాల్‌ను, క్యాలరీలను తగ్గిస్తుంది.

4. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి.

5. మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి.

6. మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండడంతో, క్యాలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గించుకొనేందుకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి.

7. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. శెనగలు, పెసలు, సోయా,అలసందలు బఠానీ తదితర పప్పు దినుసులతో మొలకలు తయారుచేసుకోవచ్చు.

8. గర్భిణీ స్త్రీలు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి. కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయోగకరము. ఇక నేటినుంచే మొలకలు తిందామా

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.