మరో వెరైటీ టమోటో రసం

0
344

మరో వెరైటీ టమోటో రసం.

కావలసినవి.

టమోటోలు — 4
చింతపండు — నిమ్మకాయంత
పచ్చిమిరపకాయలు – 4
కరివేపాకు — మూడు రెమ్మలు
కొత్తిమీర — చిన్న కట్ట లో సగం.
పసుపు — కొద్దిగా
ఉప్పు — తగినంత

ఇంటిలో చారు పొడి సిద్ధంగా లేని వారు చారు పొడి సిద్ధం చేసుకోవాలి .

కావలసినవి .

ఎండుమిరపకాయలు -2
ధనియాలు — స్పూనున్నర
జీలకర్ర — అర స్పూను
పచ్చి శనగపప్పు – స్పూను
కందిపప్పు – అర స్పూను
మిరియాలు — పావు స్పూను.
ఇంగువ — కొద్దిగా

పై దినుసులన్నీ నూనె వేయకుండా బాండీలో వేయించుకుని చల్లారగానే మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఈ రసము పొడి మూడు నాలుగు సార్లు రసము పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది .

చారులో పోపునకు.

నూనె — స్పూను
మెంతులు — కొద్దిగా
జీలకర్ర — కొద్దిగా
ఆవాలు — కొద్దిగా
ఇంగువ — కొద్దిగా

తయారీ విధానము.

చింతపండు విడదీసి పది నిముషాలు ముందు నీటిలో నానబెట్టు కోవాలి .

తర్వాత గ్లాసుడు రసము తీసుకొని వేరే ఉంచుకోవాలి.

టమోటోలు పెద్ద ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .

ఒక గిన్నెలో ఒక గ్లాసుడు నీళ్ళు పోసి టమోటో ముక్కలు వేసుకుని ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి .

నీళ్ళు విడిగా ఉంచుకోవాలి .

ముక్కలు చల్లారగానే మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .

లేదా చేతితో మెత్తగా చేసుకోవాలి .

ఇప్పుడు ఒక గిన్నెలో సిద్ధంగా ఉంచుకున్న టమోటో రసము , చింతపండు రసము పోసుకోవాలి.

అవసరమయితే మరో అర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చును.

అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు , తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు , కరివేపాకు వేసుకుని స్టౌ మీద పెట్టి బాగా తెర్లనివ్వాలి .

ఆ తర్వాత రెండు స్పూన్లు రసము పొడి వేసి మరో అయిదు నిముషాలు తెర్లనివ్వాలి .

దింపుకుని పైన తరిగిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగగానే ఎండుమిర్చి ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు రసము లో పెట్టుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే టమోటో రసము భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

ఇందులో బెల్లం వేయకూడదు.

ఈ రసము రెండు రోజులు నిల్వ ఉంటుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.