బెల్లం(jaggery)

0
464

బెల్లం(jaggery)

ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లంతయారీకి ప్రసిద్ధి. దీనిని ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో వినియోగిస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు.

ఔషథంగా

పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.

పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసిఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .

అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియను వేగవంతం చేస్తుంది .

కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు), మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపూటల వారం రోజులు తీసుకున్నా, లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన … నెలసరి సమస్యలు ఉండవు . (బహిష్ట సమస్యలు ఉండవు .).

నేయితో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె బాధ నివారణ అవుతుంది .

ముక్కు కారడముతో బాధపడుతున్న వారికి … పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .

బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .

కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని ‘మెడిసినల్‌ సుగర్‌’గా వ్యవహరిస్తారు.

పోషక విలువలు (100 గ్రాములకు)

కాలోరీస్ ——————19 cal/tbsp,

విటమిన్ బి కాంప్లెక్ష్ ——–1 g/kg,

ఫోలిక్ ఆసిడ్ ————- 1 mg /kg,

ఐరన్ ——————–2.6 mg /100 Grms,

కాల్సిం ——————8.0 mg /100 Grms,

ఫాస్ఫోరస్—————- 3–4 mg / 100 Grms,

మెగ్నీషియం ————-8 mg / 100 Grms,

పొటాసియం ————-4.8 mg / 100 Grms,

ఇతర ఉపయోగాలు, విశేషాలు

బెల్లములో రకాలు :

సాధారణముగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు . ఇది సాధారణముగా ప్రతిఒక్కరు ఉపయోగించే రకము . తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లము తయారుచేస్తారు .

చెరకు బెల్లం

బంగారు బ్రౌన్‌కలర్ నుంచి దార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . చెరకు రసాన్ని కాయడం ద్వారా తయారుచేస్తారు . భారతీయ ఇళ్ళలో వాడేరకము ఇది .

ఖర్జూర బెల్లం

ఈ బెల్లము గోల్డెన్‌ బ్రౌన్‌ నుండి డార్క్ బ్రౌన్‌ కలర్ లో ఉంటుంది . ఖర్జూర రసాన్ని మరిగించి తయారుచేస్తారు . డార్క్ చాకొలైట్ రుచి ఉంటుంది .

తాటి బెల్లము

ఆఫ్ వైట్ నుండి పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది . తాటి రసాన్ని మరిగించడము ద్వారా తయారు చేస్తారు . తెల్లని చాక్లెట్ రుచిలో ఉంటుంది .

ఈతబెల్లం

ఈతకల్లు మరిగించడము ద్వారా తయారుచేస్తారు . ఈ రకము గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్ లో ఉంటుంది . మయన్మార్ లో దీని వాడకము ఎక్కువ .

కొబ్బరి బెల్లము

దీనిని కొబ్బరి నీరు కొన్ని రసాయనాలు మరిగించడము ద్వారా తయారు చేస్తారు . దీని రంగు గోల్డెన్‌ బ్రౌన్‌ నుండి డార్క్ బ్రౌన్‌లో ఉంటుంది . దీని ఖరీదు ఎక్కువ అయినందున తయారీ చేయడం మానుకున్నారు .

సంప్రదాయంలో బెల్లం

దేవునికి నైవేద్యంగా పెడతారు.

వివాహంలో పానకం బిందెలు అనే వేడుక చోటు చేసుకుంటుంది. వరునికి వధువు ఇంటి నుండి బిందెలలో బెల్లంతో తయారు చేసిన పానకం నింపి విడిదింటిలో విడిది చేసిన వరునికి అందిస్తారు.

బెల్లంతో చేసిన పొంగలిని దేవునికి నైవేద్యంగా పెడతారు.

వివాహముహూర్తసమయానికి బెల్లం జిలకర మిశ్రమాన్ని వధూవరులు పరస్పరం ఒకరి తల మీద ఒకరు ఉంచడం వివాహక్రతువులో అతి ప్రధానం.

బాలింతకు సూడిదలు అందించే సమయంలో బెల్లంతో చేసిన చలిబిండి, బెల్లంతో చేసిన వేరుశనగ పప్పు ముద్దలు, బెల్లంతో నువ్వుండలు ఇస్తారు. బాలింతకు పౌష్టికాహారం అందించడానికి రక్తవృద్ధి కలగడానికి ఇది దోహదం చేస్తుంది.

మంగళగిరిలోని పానకాలరాయునికి బెల్లం పానకం భక్తులు కానుకగా అందిస్తారు.

వయసుకు వచ్చిన ఆడపిల్లలకు శరీరదారుఢ్యం అధికం కావడానికి నువ్వులతో చేసిన చిమ్మిలి, ఎండుకొబ్బరి బెల్లం ఇవ్వడం అందరికి పంచడం ఆనవాయితీ.వయసుకు వచ్చిన ఆడపిల్లలకు చూడడానికి వచ్చే వారు సహితం వస్తూ కొబ్బరి బెల్లం తీసుకురావడం కూడా ఆనవాయితీ.

సమ్మక్క సారలక్కా జాతరలో అమ్మవారికి భక్తులు బెల్లం కానుకగా సమర్పిస్తారు.

శ్రీరామనవమికి బెల్లం పానకం నైవేద్యంచేసి భక్తులకు అందివ్వడం ఆచారం.

అట్లతద్దికి దోశలతో పప్పు బెల్లం కలిపి నైవేద్యం ఇస్తారు.

వినాయక చవితి నాడు వినాయకునికి బెల్లంపప్పుతో చేసిన ఉండ్రాళ్ళతో చేసిన నైవేద్యం పెడతారు.

దీపావళి నోముకు బెల్లం బూరెలు నైవేద్యం ఇస్తారు.

ఉగాది పచ్చడిలో బెల్లం చేర్చడం ఆచారo
పురుషోత్తం

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.