‘బారిష్టర్ పార్వతీశం’ అమ్మడానికి రచయిత పడిన కష్టాలు

0
2662

‘బారిష్టర్ పార్వతీశం’ అమ్మడానికి రచయిత పడిన కష్టాలు!

ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్థిగారి ) మాటలలో…….
“ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు.
కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు.
.
“వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను
బారిస్టర్ పార్వతీశం. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా…. ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొన వచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయా పావలా… రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? “…… నాకు చాల బాధ కలిగింది.

బారిస్టర్ పర్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?
“ఎన్ని పుస్తకాలు తెచ్చారు” అనడిగాను.
“వంద. అంటే నూట పాతిక రూపాయిలవి”
“మీరెక్కడికి వెళ్లకండి. అవి అమ్ముడయే మార్గం నేను చూస్తాను” అన్నాను.

ఆ మర్నాడు ఒక తెల్ల కాగితం మీది ఒక ఆహ్వాన పత్రికను రాశాను ఇలా. “మొక్క పాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకం తో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయింత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి దడాబామీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది” అంటూ ఒక విద్యార్థికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులలు చూపించి, వారు చూసి నట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించాను.
.
కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సంర్పించినవి. మొక్క పాటి వారు ఎంత సంతోషించారో…. నా చేతులు పట్టుకొని ” నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి…. నీ వల్లనే” అన్నారు. క్షమించండి ఇది నావల్ల గాదు,

బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల … ఒక మంచి గ్రంథాన్ని … రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్లా……. ఇది వీరందరి రసజ్ఞత.. సంస్కారమూను..” అన్నాను.

అదే ఈ రోజుల్లో అయితే సాద్యమేనా? ……..

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.