ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?

0
318

ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?

***********
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు. కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటుంటారు. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఇకపోతే అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది. అలాగే జలుబు, దగ్గు బాధిస్తుంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధలనుండి ఉపశమనాన్ని పొందవచ్చు. డికాక్షన్‌లో కొద్దిగా అల్లం, తేనె, తులసి ఆకులను వేసి కలుపుకుని తాగినా కూడా ఈ బాధలనుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.

కీళ్లనొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రోజూ కొద్దిమేర అల్లం కూరల్లో తీసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకుంటే?

పసుపు, తేనె, వెల్లుల్లి, అల్లం వంటల్లో వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇవి శరీరానికి యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడతాయి. అల్లంలో యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. చిగుళ్ల ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

ఇక వెల్లుల్లి.. యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా కలిగివుంటుంది. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో వెల్లుల్లి నిండి ఉంటుంది. రోజు తయారు చేసుకొనే వంటకాల్లో వెల్లుల్లిని భాగం చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడపున రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవడం మంచిది.

ఇకపోతే.. దాల్చిన చెక్క పొడిని తేనె సమపాళ్లలో తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజు చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. యాంటీ మెక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు బాక్టీరియాను నశింపచేస్తాయి.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.