ప్రపంచంలోని అతి పెద్ద మరియు అతి ఐశ్వర్యవంత దత్త దేవాలయం – వేదాంతనగర్

0
450

ప్రపంచంలోని అతి పెద్ద మరియు అతి ఐశ్వర్యవంత దత్త దేవాలయం – వేదాంతనగర్.సూర్య కిరణాల ప్రసారం బట్టి ఈ ఆలయం రంగు మారడం మరొక విశేషం .ఇది మరెక్కడో కాదు ,షిరిడీ కి అతి సమీపంలో ఉంది .
శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శాలివాహన శకం 1924 చిత్రభాను సంవత్సరం ఆశ్వీయుజ నవమి, బుధవారం, ఆశ్లేషా నక్షత్ర సమయంలో ప్రపంచం లోనే అతిపెద్ద & అతి ఐశ్వర్యవంత దత్తదేవాలయ నిర్మాణానికి శిలాన్యాసం జరిగింది. దీనికి ముందు కర్త-కర్మ-క్రియ అయిన, రెండవ సంపూర్ణ దత్తావతారమైన శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారు, ఈ కార్యాన్ని ఈదేవాలయ వ్యవస్థాపకులైన శ్రీ రామకృష్ణ స్వామి వారికి కనిపించి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఆదేశించారట. పైగా ” నేను వేద ప్రియుడనూ, గోప్రియుడను. వేదపఠనమన్న నాకు మిక్కిలి ప్రీతి. ఇంకా చెప్పాలంటే ‘వేదలోలుడను’ నేను. నీ చేతుల మీదుగా సాగే ఈ దేవాలయ నిర్మాణం మిగతా అన్ని దేవాలయాలకు భిన్నంగా నిత్యం వేదపఠనంతో,te, ‘సామగానం’తోపాటు మిగిలిన వేదాలలోని పనసల ఉచ్చారణలతో ఇక్కడి ప్రతీ అణువు నిండిపోవాలి. ప్రస్తుతం వేదం ‘నిర్వేదం’గా మారుతోంది. నీ ఆధ్వర్యంలో మార్పు తీసుకురా! మా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి” అని చెప్పారట. శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలంటే దేవాలయ నిర్మాణంతో పాటుగా అక్కడే ఒక వేద విద్యా పీఠంను కుడా స్థాపించాలనీ, అక్కడ లుప్తమైపోతున్న వేద విద్యను ఎంపిక చేసిన పిల్లలకు ఉచితంగా అందివ్వాలని తలపోశారు. ఫలితంగా అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద దత్తదేవాలయం తో పాటుగా ‘వేదాంత’ వేదవిద్యాపీఠ యూనివర్సిటీ కుడా స్థాపించబడినది. దేవాలయ నిర్మాణానికి ప్లాన్ కుడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారే ఇచ్చారని ఇక్కడి స్థానిక భక్తుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణానికిగానూ ప్రత్యేకంగా ఎంపిక చేసిన Banshi – Sri Padhpur Pink Stones (గులాబి గోధుమ రాళ్ళు) తెప్పించి నిర్మాణం గావించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి పడిన దేవాలయ ప్రాంగణం Pink Colour లో మెరిసిపోతూ కనిపిస్తుంది. సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి దేవాలయం రంగు మారుతూ ఉంటుంది. దేవాలయం నిర్మాణం ఇంకా కొద్ది కాలం లో పూర్తవుతుందనగా శ్రీక్షేత్ర దేవల్ గాణగాపూర్ (కర్నాటక) నుండి ఆశ్చర్యకరంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు ఈ క్షేత్రానికి వచ్చాయి. నేటికీ ఆ పాదుకలను మనమీ క్షేత్రంలో దర్శించి తరించవచ్చు. అలాగే దేవాలయ నిర్మాణం ప్రారంభమైన కొద్ది రోజులలోనే దేవాలయ ప్రాంగణంలో అతి ఆశ్చర్యకరంగా ఒకే తల్లి వేరు వ్యవస్థ నుండి పుట్టిన ఔదుంబరం, వటవృక్షం మరియు అశ్వద్ధ వృక్షాలు ఒకే వేరుతో ఒకే కాండంతో పుట్టుకొచ్చాయి. ఈ క్షేత్రంలో నేటికీ ఆ ‘కల్పవృక్షాన్ని’ మనం దర్శించి తరించవచ్చు. అదేవిధంగా అత్యంత ఖరీదైన 24 Carat of Gilded Marble తో అతి సుందరమైన త్రిముఖ షట్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని కుడా ఈ దేవాలయంలో ప్రతిష్టించారు. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం ఏంటంటే దేవాలయ వ్యవస్థాపకులు ఈ దేవాలయానికి దాదాపు 7 KMs దూరంలో లో ‘నృసింహ సరస్వతి తపోవనం’ అనే పేరుతో ఒక విశాల ‘గోశాల’ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసారు. ప్రతీ రోజూ వేకువఝామునే కొంత మంది విద్యార్ధుల బృందంతో ఆచార్యుల వారు అక్కడకు చేరి గోవులకు వేదం చదివి వినిపిస్తారు. ఈ విధంగా ఇక్కడ Shift System లో ప్రతీ రోజూ జరుగుతుంది (ఆదివారాలతో సహా). ప్రాతః కాల వేద శ్రవణానంతరం గోవులు వాటి ఇష్టానుసారంగా అక్కడ గల విశాలప్రాంగణంలో తిరుగుతాయి. ఒక విద్యార్ధుల బృందం గోశాలలో వేదపఠనంలో ఉండగా మరొక విద్యార్ధుల బృందం ప్రధాన దేవాలయంలో వేదపఠనం గావిస్తారు. ఈ రెండు కూడా ఒకే సమయంలో జరుగుతాయి.
విచారకరమైన విషయమేమంటే ఇంతటి శక్తివంతమైన ఈక్షేత్రం షిర్డీకి అతి దగ్గరలో ఉన్నప్పటీకీ దర్శించే తెలుగు వారు మాత్రం అతి అరుదు.

వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర ప్రత్యేకత
1. ప్రపంచంలోని అతిపెద్ద దత్త దేవాలయం
2. ప్రపంచంలోని అతి ఐశ్వర్యవంత దత్తాత్రేయుడు
3. వేదవిద్యాపీఠ యూనివర్సిటీ కలిగిన ప్రపంచపు ఏకైక దత్తదేవాలయం ( University లో దేవాలయాలను చూసి ఉంటామేమోగానీ, దేవాలయంలో University ఉండడడం ఎక్కడా చూసి ఉండం)
4. ఒకే తల్లి వేరు వ్యవస్థ నుండి పుట్టిన ఔదుంబరం, వట వృక్షం మరియు అశ్వద్ధ వృక్షాలు కల్పవృక్షంగా ఉద్భవించి ఈ క్షేత్రంలో ఉండడం
5. గోవులకు వేదం చదివి వినిపించే ఏకైక దత్త క్షేత్రం
6. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు వచ్చి చేరిన క్షేత్రం
7. సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిచే దేవాలయ నిర్మాణానికి ప్లాన్ ఇవ్వబడిన క్షేత్రం
8. ప్రపంచంలో Architecture పరంగా అతి సుందరమైన దత్త దేవాలయం
Postal Address : Vedant Nagar Dattatrya Temple, Opp: Nobel Hospital, Near Tarakpur Bus Stand, Manmad Road, Ahmednagar – 414003, Maharashtra, Ph: 0241-2423585

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.