పోషకాలు మెండు.. ఆరోగ్యం నిండు

0
174

• పోషకాలు మెండు.. ఆరోగ్యం నిండు
సాధారణ రోజుల్లోకంటే పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం భిన్నంగా ఉంటుంది. చదువుకోవడానికి ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులపై ఒత్తిడి స్థాయి పెరిగేందుకు అవకాశముంటుంది. ఆరోగ్యంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. 
అలాంటి ఒత్తిళ్లను అధిగమించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి పద్ధతుల్ని పాటించాలనే విషయంపై పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్‌ చెబుతున్నారిలా..!
* చదువుకునే పిల్లలు ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవాలి. అలా చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్‌ నిల్వలు సరైన మోతాదులో ఉంచుకోవచ్చు. మరోవైపు ప్రోటీన్లు సమతులంగా ఉండి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. 
* రాత్రివేళ చదువుకోవాల్సి వస్తే పిల్లలకు నిద్ర రాకుండా ఉండేందుకు చాలా మంది తల్లిదండ్రులు టీ, కాఫీలు ఇస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా పాలను మాత్రమే ఇవ్వాలి. పాలల్లో తగినంతగా ప్రోటీన్లు, కాల్షియం ఉంటాయి.
* అల్పాహారం వీలైనంత తొందరగా తీసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డును అల్పాహారంతో కలిపి ఇస్తే మంచిది. జ్ఞాపకశక్తికి దోహదం చేసే విటమిన్లు, ఖనిజాలు వీటిలో ఉంటాయి. 
* చదువుకునేందుకు ఏకకాలంలో 4-5 గంటలపాటు సమయం వెచ్చించాల్సి వస్తే.. మధ్య మధ్యలో లేచి కాస్త అటూఇటూ తిరగడం ఉత్తమం. 5-10 నిమిషాలపాటు విరామమివ్వాలి. ఓపిక పెరిగేందుకు మధ్యలో పండ్ల రసాలు తీసుకోవాలి. 
* ఎక్కువ మోతాదులో ఉప్పు, పంచదార, మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. పిజ్జా, బర్గర్ల వంటి జంక్‌ఫుడ్స్‌ అసలే వద్దు. ఈ తరహా ఆహారం మగతనిద్రకు, అలసటకు గురిచేస్తాయి. ఒక్కోసారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 
* ఆహారంలో మాంసాహారం కంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* ఖర్జూరం, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌.. లాంటి వాటిని తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజల్ని స్నాక్స్‌గా తీసుకుంటే విలువైన పోషకాలు లభిస్తాయి.
* పుచ్చకాయ, గుమ్మడికాయ.. తదితర కాయల గింజల్ని తీసుకోవచ్చు. లేదా ఆ గింజల్ని పొడి చేసి పాలతో కలిపి తీసుకోవచ్చు. మెదడును ఏకాగ్రతతో ఉంచేందుకు అవసరమైన ఒమెగా3, ఒమెగా6 ఫ్యాటీ ఆమ్లాలు వీటిలో ఉంటాయి. 
* శరీరాన్ని డీహైడ్రేషన్‌ బారి నుంచి కాపాడుకునేందుకు తగినంత మంచి నీరు తీసుకోవాలి. పిల్లలు రోజు 8-10 గ్లాసులు లేదా 3-3.5 లీటర్ల శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.