పొట్ట తగ్గటానికి

0
134

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
1, పొట్ట తగ్గటానికి
*****************
సొంఠి ,
పిప్పళ్ళు ,
మిరియాలు,
కరకపిందెలు
శుద్దగుగ్గులు
వాయుమిర్యాలు
తుంగముస్తలు
అన్నిసమభాగాలుగా తీసుకుని దంచి జల్లించి
అందులో తగినంత సైందవలవణపొడి కలిపి నిలువౌంచుకోవాలి
రోజూ రాత్రినిద్రించేముందు చెంచా పొడితో ప్రారంభించి క్రమంగాశరీర స్తితినిబట్టి 2చెంచాలవరకు
పెంచుకుంటూ ఒకచెంచా తేనెతో కలిపి రోజూ పరగడుపున సేవించాలి

2, పొట్ట తగ్గటానికి
*********************
శరత్ కాలంలొ వర్షపునీటిని పాత్రలద్వార పట్టుకుని కనీసం 10 బిదెలుఐనా నిలువచేసుకోవాలి.
రోజూ అరగ్లాసు నీటీలొ ఇంటిలో కొట్టుకున్న మేలిరకమైన పసుపు అరచెంచా కలుపుకుని రోజూ పరగడుపున సేవిచాలి
ఇలాకనీసం100 రోజులు పాటు చేస్తే మంచి ఫలితాలు కనబతాయి

3, పొట్ట తగ్గటానికి
*****************
ఉత్తరేణి ఆకులను కడిగి దంచి తీసిన రసంఒకలిటరు
నువ్వులనూనె ఒకలీటరు కలిపి ఒకపాత్ర లో పోసి
చిన్నమంటపైన రసము ఇగిరి నూనెమాత్రమే మిగిలేవరకూ మరిగించి వడపోసి నిలువ ఉంచుకోవాలి
ఈ తైలాన్ని రెండుపూటలా స్నానానికి గంటముందుగా తగినంత అతైలాన్ని గోరువెచ్చగా వేడి
చేసిఅతిగాపెరిగిన పొట్టపైన ఇరుప్రక్కలా నిదానంగా లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి
ఉత్తరేణి రసం లోపలికి ఇంకిపోతి అతి కొవ్వు ను అణిచివేయడమే కాక చర్మవ్యాదులను
అణిచి వేస్తుంది

4,పొట్ట తగ్గటానికి
******************
పసుపు పొడి,.
పల్లేరుకాయలపొడి,
తుంగగడ్డలపొడి,
దోరగావేయించిన సొంఠి పొడి దోరగావేయించినఆవాలపొడీ
ఈపదార్దాలు ఒక్కొక్కటి 20gతీసుకోవాలి. అందులో ఎర్రచందనంపొడి40g
లవంగాలపొడి 100g
సారపప్పుపొడి100g
కలపాలి ఈమోత్తంమిశ్రమాన్ని ఒకడబ్బా లోనిలువచేసుకోవాలి.
ఉత్తరేణి తైలంతో మర్ద్నాచేసినతరువాత ఈ చూర్ణాన్ని తగనంత తీసుకుని అందులో కొద్దిగానువ్వులనూనె
కలిపి అతిగా కొవ్వుపెరిగిన అన్ని చోట్లా నలుగు పెట్టినట్లుగారుద్ది ఒకగంట ఆగి స్నానంచేయాలి

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.