నీళ్లు తాగుతున్నారా

0
106

 

నీళ్లు తాగుతున్నారా…!!!

దాహం వేస్తేనే నీళ్లు తాగాలనుకుంటారు చాలామంది. కానీ ఎండలు పెరుగుతున్నాయి. నీళ్లు తాగకపోతే చాలా సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్‌తోనూ బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఆ లక్షణాలు గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* దుర్వాసన: శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు లాలాజలం తయారీ ఉండదు. అలాంటప్పుడు నోరు పొడిబారి దుర్వాసన రావచ్చు. ఆ సంకేతం కనిపిస్తే… నీళ్లు ఎక్కువగా తాగి చూడండి. అయినా సమస్య తగ్గకపోతే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి.

* పొడి చర్మం: చర్మం పొడిబారడం సాధారణ సమస్యే. మరీ అతిగా పొడిబారి దురద వస్తోందంటే మాత్రం మీరు నీళ్లు సరిగా తాగట్లేదని అర్థం. శరీరం తేమని కోల్పోతే చర్మం ఎండిపోయినట్టు అవుతుంది. ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తే సొరియాసిస్‌… ఎగ్జిమా కూడా రావచ్చు. అందుకే నీళ్లు సరిగా తీసుకోవాలి.

* కండరాల నొప్పులు: డీహైడ్రేషన్‌ వల్ల కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. కండరాల వద్ద కణజాలానికి తేమ సరిపోకపోయినా వదులుగా అయి నొప్పి అనిపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కీళ్లనొప్పులుగా మారొచ్చు.

* కళ్ల అలసట: కళ్లు పొడిబారటం, అలసటకు గురి కావడం జరుగుతుంటే మాత్రం విశ్రాంతి తీసుకోవడంతోపాటు డీహైడ్రేషన్‌ సమస్య ఉందేమో గమనించుకోవాలి. నీళ్లు తాగడం, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

* తలనొప్పి: తరచుగా తలనొప్పి బాధిస్తోంటే మాత్రం మందులు వాడటం, కళ్లు పరీక్షించుకోవడం చేస్తుంటారు. అయితే అన్నిసార్లూ తలనొప్పికి ఇవే కారణాలు కాకపోవచ్చు. ముందు గ్లాసు నీళ్లు తాగి చూడండి. డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నారేమో తెలుస్తుంది. కాస్త ఉపశమనం ఉంటే.. నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.