నిమ్మకాయ కారం. రోటి పచ్చడి

0
854

నిమ్మకాయ కారం. రోటి పచ్చడి .

కావలసినవి .

ఎండుమిరపకాయలు — పది
నిమ్మకాయలు — 4
పొట్టు మినపప్పు — 40 గ్రాములు
మెంతులు — మూడు స్పూన్లు
ఆవాలు — పావు స్పూను
పసుపు — కొద్దిగా
ఇంగువ — మరి కాస్త
జీలకర్ర — పావు స్పూను
నూనె — మూడు స్పూన్లు
ఉప్పు — తగినంత

తయారీ విధానము .

ముందు నిమ్మకాయలు అడ్డంగా కోసుకొని ఒక గిన్నెలో రసము తీసుకోవాలి.

స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె కాగగానే ముందుగా మెంతులు, పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు వేసి కమ్మని వాసన వచ్చే దాకా వేయించుకోవాలి.

ఆ తర్వాత జీలకర్ర , ఇంగువ , వేసి వేగాక దింపి దానిపై కొద్దిగా పసుపు వేసుకోవాలి.

చల్లారగానే రోటిలో వేగిన పోపు , తగినంత ఉప్పు వేసి పప్పులు తగిలే విధంగా పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసిన నిమ్మరసం తో కలిపాలి.

స్పూను తో బాగా కలుపుకోవాలి .

ఈ నిమ్మకాయ కారం గట్టిగా ఉంటే బాగుంటుంది .

పల్చగా కావాలను కునే వారు మరో కాయ నిమ్మరసం పిండుకోండి.

ఈ నిమ్మకాయ కారం రోటిలో రోకలితో దంపుకుని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది .

ఈ కారం అన్నం లోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , దిబ్బ రొట్టె లోకి కూడా చాలా బాగుంటుంది .

కందిపప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుని , తగినన్ని నీళ్ళు పోసుకుని , ముద్దపప్పు లా వండుకుని , వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని , పప్పు కలుపుకుని, ఈ నిమ్మకాయ కారం నంచుకొని తిని ఎలా ఉందో చెప్పండి.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.