దాసరి నారాయణ రావు (04-05-1947 & 30-05-2017) గారి 71 వ జయంతి

0
283

దాసరి నారాయణ రావు (04-05-1947 & 30-05-2017) గారి 71 వ జయంతి:-

తెలుగు తెరపై దేశభక్తి మీద తక్కువ సంఖ్యలో సినిమాలొచ్చాయి. చటుక్కున గుర్తుకు వచ్చే సినిమాలు మన దేశం (1949),

అల్లూరి సీతారామరాజు (1974), సర్దార్ పాపారాయుడు (1980), రోజా (1992), భారతీయుడు (1996) .

30-10-1980 న విడుదలైన సర్దార్ పాపారాయుడు, ఈ రోజు దాసరి నారాయణ రావు గారి (04-05-1947 & 30-05-2017) 71 వ జయంతి సందర్భంగా ఈ టీ వీ సినిమా (టాటా స్కై చానెల్ 1447) లో ఈ రోజు (04-05-2018 శుక్రవారం) రాత్రి 7 గంటలకు వేస్తున్నారు.

భరతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన ఒక దేశభక్తుడు… తీరా స్వతంత్ర భారతదేశం నల్లదొరల పీడనలో పడిపోయిందని గ్రహిస్తే? ఇప్పుడు మరో స్వాతంత్య్ర పోరాటం చేయడానికి సిద్ధపడితే? అటు స్వాతంత్య్ర పూర్వ వాతావరణాన్నీ, ఇటు సమకాలీన భారతీయ సమాజ పరిస్థితుల్నీ ఏకకాలంలో తెరపై చూపిన ప్రత్యేక చిత్రం – ‘సర్దార్ పాపారాయుడు’. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించింది.

ఎన్ టి ఆర్ తో దర్శకరత్న దాసరినారాయణావు కేవలం ఐదు సినిమాలనే తీశారు. అయితే ఈ సినిమాలు ఎన్టీఆర్ కు రాజకీయాల్లో రావడానికి కూడ ప్రధాన కారణంగా మారాయి. సర్దార్ పాపారాయుడు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఊత్య్ లో చిత్రీకరించారు. ఫాగ్ ఎఫెక్ట్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ నడిచివస్తోంటే దాసరి నారాయణరావు ఒళ్ళు పులకరించిపోయింది.

షూటింగ్ నిలిపివేసిన వెంటనే దాసరి వెళ్ళి ఎన్టీఆర్ కు పాదాబివందనం చేశాడు. ఏమిటీ నారాయణరావు గారు అంటూ ఎన్టీఆర్ దాసరిని ప్రశ్నించారు. ఎన్టీఆర్ లో అల్లూరిని చూశానని అందుకే పాదాబివందనం చేసినట్టు దాసరి చెప్పారు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనుభావుల గురించి ఇప్పుడు చెప్పుకొంటున్నాం. మన గురించి భావి తరాలు చర్చించుకొనే అవకాశం ఉంటుందా అని ఎన్టీఆర్ దాసరిని ప్రశ్నించారు. ప్రజాసేవ చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తుంచుకొంటారని దాసరి ఆయనకు సలహాఇచ్చారు. అదేరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ ప్రజాసేవకు సమయాన్ని కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారు.

వినరా సోదర

దాసరి నారాయణ రావు గారు గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడని ముందుగా చెప్పింది ఎన్ టి ఆర్. దాసరి నారాయణరావు గారు బీం సింగ్ దగ్గర కో డైరెక్టర్ గా “ఒకే కుటుంబం” చిత్రానికి పనిచేస్తున్న రోజులవి. ఓ సన్నివేశాన్ని దాసరి చిత్రీకరించిన తీరు చూసి ఎన్ టి ఆర్ అలా ఆశీర్వదించారు అని దాసరి చెప్పేవారు.

మంచిని మరచి

మనుషులంతా ఒకటే (07-04-1976) ఎన్ టి ఆర్, దాసరి కలయికలో వచ్చిన తొలి చిత్రం. ఆ సినిమాలో జమున, మంజుల నాయికలు. ఇద్దరు నాయికలున్నా యుగళ గీతాలుండవు. సామాజిక న్యాయం గూర్చి చెప్పే కధ. దున్నేవాడిదే భూమి పండించే వాడే ఆసామి అని నినదించే చిత్రం. సంచలన విజయం సాధించింది.
ఎవడిదిరా ఈ భూమి

సర్కస్ రాముడు (01-03-1980), సూరీడు చుక్కెట్తుకుంది

విశ్వరూపం (25-07-1981), నూటికో కోటికో

బొబ్బిలి పులి (09-07-1982) చిత్రానికి క్లాప్ కొట్టేవరకూ ఎన్ టి ఆర్ కధ వినలేదు. షూటింగ్ కు ముందు ఆయన ఖాట్మండులో ఉన్నారు. అక్కడినుండి ఫోన్ చేసి పాత్ర ఏమిటి అన్నారు. మిలిటరీ మేజర్ అన్నారు దాసరి. ఆ పాతర్కు తగ్గట్టు కొలతలిచ్చారు. క్లాప్ కొట్టాకా కధ విన్నారు. దర్శక రత్న పై నట రత్నకున్న నమ్మకం అటువంటిది.
జననీ జన్మభూమిశ్చ

సంభవం నీకే

ఎన్ టి ఆర్ రాజకీయాలోకి రావడానికి సర్దార్ పాపారాయుడు స్పూర్తి, బొబ్బిలి పులి ఆ పార్టీకి మ్యానిఫెస్టో వంటిది అని ఎన్ టి ఆర్ తనతో అన్నారని దాసరి చెప్పారు ఒకసారి.

మద్రాసులో ఎన్ టి ఆర్, దాసరి ఒకే వీధిలో ఉండేవారు. నారాయణ రావుఫ్గారు రాత్రి 2 గంటలవరకూ ఏదో కధ గూర్చి చర్చిస్తూ ఉండేవారు. ఎన్ టి ఆర్ దినచర్య రాత్రి 2 గంటలకు మొదలవుతుంది. అందుకని మా వీధికి కాపలా అవసరం లేదు అనారు ఎన్ టి ఆర్ ఒకసారి సరదాగా.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.