దాల్చిన చెక్క

0
560

దాల్చిన చెక్క
*************
బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని దానిలోనూ ఔషధ గుణాలున్నాయని కొందరికే తెలుస్తుంది. . దాల్చిన చెక్కకు సంస్కృతంలో ‘త్వక్’అనే పేరుంది. ‘దారుసితా’ (తియ్యని మాను కలిగినది అని అర్థం) అనేది కూడా దాల్చిన చెక్క పేరే. * తెలుగులో దాల్చిన పట్ట అనీ లవంగ పట్ట అనీ పిలుస్తారు. అయితే లవంగం చెట్టుకూ దాల్చిన చెట్టుకూ సంబంధం లేదు.

* ‘బిర్యానీ ఆకు’ అనే పేరుతో మార్కెట్లో మనకు కనిపించేది ‘సిన్నమోమం తమాల’ (ఆకు పత్రకం) అనే చెట్టు ఆకులు. దాల్చిన ఆకులను తేజ్‌పత్ అంటారు

పట్ట చూర్ణాన్ని 1-3 గ్రాముల మోతాదులోనూ, పట్టనుంచి తీసిన సుగంధ తైలాన్ని 2-5 బిందువుల మోతాదులోనూ ఉపయోగించాలి.

* దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం. త్వగాది లేహ్యం, త్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. దాల్చిన చెక్కను సాధారణంగా కూరల్లో వాడడమేకాకుండా పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగితే మంచి ఫలితానిస్తుంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. దీనిని వాడడం వలన కడుపులో వాతం బాగా తగ్గుతుంది.

ఒక్కొక్కమారు పిల్లలు కల్తీ తినుబండారాలు లాగించాస్తారు. అవి విషతుల్యమైనవి. ఇందులోని విషప్రభావాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక్కొక్కమారు శరీరంలో నీరు అధికమవుతుంటుంది. ఇలాంటి సమయంలో దానిని తొలగించడానికి దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే క్రమంగా ఉపశమనం లభిస్తుంది. పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు కాస్త దాల్చిన చెక్కను తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వరపేటిక వాపు, బొంగురు పోవడం వంటి వ్యాధులతోపాటు, గురగుర ఉన్నవారు చెక్కను దవడన పెట్టుకుని ఊటను మింగుతూ వస్తే అవన్నీ నయమయ్యే అవకాశం ఉంది.

మహిళల్లోని రుతుదోషాల నివారణకు ఇది దివ్య ఔషదంలా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వలన రుతుస్రావం సరియైన సమయంలో జరిగేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలను నియంత్రంచడానికి దాల్చిన చెక్కను ఉడకబెట్టి పేస్టు చేసి దానిలో దానిలో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే చాలు. విరేచనాలు తగ్గుతాయి.

కొన్ని ఔషధ గుణాలు : చర్మం ముడతలు, రంగు తగ్గటం దాల్చిన చెక్క పొడిని, గంధం పొడినీ రోజ్‌వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి ప్రతిరోజూ రాత్రిపూట తీసుకోవాలి. ఆమాశయపు క్యాన్సర్ రెండంగుళాల దాల్చిన చెక్క ముక్కను చిన్న చిన్న పేళ్లుగా విరిచి, ఒకటిన్నర కప్పుల నీళ్లకు కలిపి 10 నిమిషాలపాటు మరిగించి వడపోసి, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే పేగులకు, ఆమాశయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఉపయుక్తంగా ఉంటుంది. మొటిమలు, బ్లాక్‌హెడ్స్ దాల్చిన చెక్క పొడిని, నిమ్మ రసాన్ని ముద్దగా కలిపి మొటిమల మీద ప్రయోగిస్తే జిడ్డు తగ్గి త్వరగా మాడిపోతాయి. రక్తహీనత పావు చెంచాడు దాల్చిన చెక్క పొడిని అర కప్పు దానిమ్మ రసానికి కలిపి, అర చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉంటే రక్తం పెరుగుతుంది.

అజీర్ణంవల్ల విరేచనాలు దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడిని సమభాగాలు కలిపి అర టీస్పూన్ మోతాదులో తేనెతో రెండుపూటలా తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, విరేచనాలు తగ్గుతాయి.

ముక్కుదిబ్బడ

దాల్చిన చెక్క మిరియాలు, ఏలక్కాయాలు, నల్ల జీలకర్ర (కలౌంజి)లను సమంగా తీసుకొని పొడిచేసి చర్ణనస్యంగా పీల్చితే కఫం తెగి, గాలి ధారాళంగా ఆడుతుంది. జలుబు దాల్చిన చెక్క, మిరియాలు సమంగా తీసుకొని నూరి, కషాయం తయారుచేసుకొని తాగితే జలుబులో హితకరంగా ఉంటుంది. నిద్ర పట్టకపోవటం అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టీ కప్పు నీళ్లకు కలిపి ఐదు నిమిషాలు మరిగించి తేనె కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే గాఢమైన నిద్ర పడుతుంది. పంటి నొప్పి దాల్చిన నూనెలో దూదిని ముంచి దంతాల మీద ఉంచుకుంటే పంటి నొప్పి నుంచి ఉప శమనం లభిస్తుంది.

దంతాలమీద మరకలు దాల్చిన ఆకులను మెత్తగా నూరి, పండ్లపొడి తయారుచేసుకొని వాడితే దంతాలు మిలమిల మెరుస్తాయి. ఇన్‌ఫ్లుయంజా (ఫ్లూజ్వరం) దాల్చిన చెక్క మూడున్నర గ్రాములు, లవంగాలు 600 మిల్లీగ్రాములు, శొంఠి 2గ్రాములు తీసుకొని ఒక లీటర్ నీళ్లలో వేసి మరిగించాలి. పావు లీటర్ కషాయంగా మారిన తరువాత వడపోసి పూటకు 50 మిల్లీలీటర్ల మోతాదులో (అరకప్పు) మూడుపూటలా తీసుకుంటే వైరస్ కారణంగా వచ్చే జ్వరం త్వరితగతిన తగ్గుతుంది. కర్ణస్రావాలు (చెవినుంచి చీము కారటం) దాల్చిన నూనెను దూదితో తడిపి మూసిన కనురెప్పల మీద ప్రయోగిస్తే నేత్రాల నొప్పి తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి. కళ్లు అసంకల్పితంగా కొట్టుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క – మధుమేహ వ్యాధి నివారణ

టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్ర

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.