టమోటాల పచ్చడి

0
176

టమోటాల పచ్చడి .

కావలసినవి .

టమోటాలు తయారైనవి — ఎనిమిది
పచ్చి మిర్చి — పది .
కరివేపాకు — మూడు రెబ్బలు
కొత్తిమీర — ఒక కట్ట.
చింతపండు — నిమ్మకాయంత
ఉప్పు — తగినంత
పసుపు — అర స్పూను .
నూనె — రెండు గరిటెలు .

పోపుకు కావలసినవి .

ఎండుమిర్చి — ఎనిమిది
ఆవాలు – స్పూను
మినపప్పు — రెండు స్పూన్లు
జీలకర్ర — అర స్పూను
ఇంగువ — తగినంత
మెంతులు – అర స్పూను .

తయారీ విధానము —

ముందుగా టమోటాలు ముక్కలుగా కోసుకోవాలి .

బాండీలో నూనె వేసుకుని నూనె కాగగానే టమోటాలు , పచ్చి మిర్చి ముక్కలను , కొద్దిగా ఉప్పు , పసుపు వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు మళ్ళీ బాండీలో నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు మరియు కరివేపాకు పోపు పదార్ధములన్నీ వేసి పోపు పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో ముందుగా ఎండు మిర్చి , చింతపండు , ఉప్పు , వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.

మగ్గపెట్టిన టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిగిలిన పోపు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి.

తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే ఘమ ఘమ లాడే కొత్తిమీర ,ఇంగువ వాసనలతో టమోటో పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.