జ్ఞానము

0
267

జ్ఞానము

ఒక (బంగారు) పిచ్చుక కట్టిన గూటిని మనము విడదీయ లేము, అలాంటిది భగవంతుడు కట్టిన ఈ శరీరమనే గూటిని మనము విడదీయగలమా? చెఱలో చిక్కిన శ్రీమంతుడికి దానినుండి బయట పడి సుఖభోగములననుభవించిటము కంటే చెఱ నుండి బయటకు రావడమే ముఖ్యముగా తోస్తుంది. అలాగే ఆత్మ ఈశరీరము నుండి బయట పడుటే పెద్ద విషయముగా తోస్తుంది. కానీ అది అంత సులభము కాదు. దానికి శరణాగతి చేయటము ఒకటే మార్గము. ఆ శ్రియః పతి శ్రీచరణాలలో శరణాగతి చేయటము తేనె లాగా ఎంతో తియ్యనిధి. ఆ తియ్యదనమును అనుభవించిన వారికి, మిక్కిలి ప్రీతితో దానిలోనే మునిగి వుండాలని అనిపిస్తుంది. బిడ్డ తల్లి పాలకోసము ఎలా ఆశతో చూస్తుందో ,అలాగే శరణాగతి చేయు వారు, భగవంతుడి శ్రీపాదముల తేనేను ఆస్వాదించుటకు ఆత్రుతతో వుంటారు. ఆ ఆత్రుతలో తాను గతములో పట్టుకున్న లౌకిక విషయములను వదిలి వేస్తాడు. అవి కూడ వీరిని వదిలి వేస్తాయి. చెట్ట మీద పండిన పండు తానే ఎలా పడి పోతుందే, అలాగే భగవంతుని శ్రీపాదములకు చేసే శరణాగతి లౌకిక బంధనాలు తామే వదిలివేసే విధముగా కృప చేస్తుంది.

కావున , శరీరముతో జీవించుటను చెఱగా గ్రహించి ,దాని నుండి విడివడుటకు భగవంతుని శ్రీపాదములను అనుభవించు కోరిక గలవారు అమ్మవారి కృపతో లౌకిక జీవనముపై గల కోరికలను పూర్తిగా వదిలి వేసి పురుషకారముతో, భగవంతుని శ్రీపాదములను శారణాగతి చేస్తే ఆయన వేంటనె మోక్షమును ప్రసాదిస్తాడు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.