జుట్టునెరుపుకు

0
151

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:

జుట్టునెరుపుకు 

***********************

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటాయి. దీనిని  బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా  డై  మొదలు పెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో బాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలానిన్ స్థాయిని జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది. దీన్ని తిరిగి నల్లగా మార్చటం సాధ్యం కాదు. అయితే బాల్యం, యవ్వనంలో ఈ సమస్య వస్తే దానిని తగు చిట్కా వైద్యం, ఆహార నియమాల సాయంతో ఎదుర్కోవచ్చు.
ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం… 
బాలనెరుపు ఉన్నవారు రోజూ కప్పు ఉసిరికాయ రసం తాగితే జుట్టు కుదుళ్ళు బలపడటమే గాక నెరుపు ఆగుతుంది.
10 గ్రాముల వెల్లుల్లి పొట్టును బూడిద చేసి 100 మి .లీ ఆలివ్ ఆయిల్ లో కలిపి 10 రోజులు నిల్వ చేసి దాన్ని రోజూ రాత్రి తలకు రాసుకొని ఉదయం తల స్నానం చెయ్యాలి.
కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటి కూర ఈ మూడింటినీ కలిపి రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత తలస్నానం చెయ్యాలి. ఈ మిశ్రమాలతో పాటు నేల ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రెండు మూడు కప్పుల నీటిలో గుప్పెడు రాచ ఉసిరికాయలు వేసి ఉడికిన తర్వాత గుజ్జుగా చేసి దానికి సమపాళ్లలో గోరింటాకు పొడి కలిపి కుదుళ్లకి పట్టించాలి. ఇలా వారానికి కనీసం 3 సార్లు చేస్తే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
ఒక గిన్నెలో 4 చెంచాల చొప్పున నిమ్మరసం, కాఫీ పొడి, గుడ్డుసొన, 2 చెంచాల కొబ్బరినూనె, 2 చెంచాల వడగట్టిన ఉసిరి రసం కలిపి 3 గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత దానిని జుట్టు కుదుళ్ళ మొదలు చివరలు వరకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
గోరింటాకు, మందార ఆకు, కరివేపాకు ఈ మూడింటినీ సమపాళ్ళలో కలిపి రుబ్బి తలకు పట్టించి, ఆరిన తర్వాత రాసి తలస్నానం చేస్తుంటే క్రమంగా బాల నెరుపు పోయి, జుట్టు నల్లబడుతుంది.
ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
రోజువారీ ఆహారంలో కరివేపాకును పచ్చడి, పొడి వంట రూపాల్లో విరివిగా వాడాలి.
పడగడుపునే రుబ్బిన పచ్చి కరివేపాకు ముద్ద తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.