చిలగడ దుంపతో చెప్పలేనంత మేలు

0
247

చిలగడ దుంపతో చెప్పలేనంత మేలు

ఈ దుంప జోలికి ఎప్పుడూ వెళ్లం! అనాకారిలాగా, మట్టి అంటించుకుని ఉండే చిలగడ దుంపలు కనిపిస్తే ముఖం తిప్పేస్తాం! కానీ మరే పదార్థమూ అందించలేనన్ని పోషకాలు చిలగడ దుంపలో ఉంటాయి.

* విటమిన్‌ ఎ: చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరగానే ‘విటమిన్‌ ఎ’గా మారుతుంది. ఈ విటమిన్‌ లోపంతో బాధ పడేవారు రోజుకో చిలగడ దుంప తింటే ఫలితం ‘విటమిన్‌ ఎ’ లోపంతో తలెత్తే నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.

* మధుమేహం అదుపులో: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంతో పాటు, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని అదుపు చేసే శక్తి చిలకడ దుంపలకు ఉంటుంది.

* క్యాన్సర్‌ నివారిణి: క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు చిలగడ దుంపల్లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆహారం తినడం వల్ల ఉదరం, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

* పొట్టలో పుండ్లు: ఈ దుంపలోని బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌, పొటాషియం, క్యాల్షియంలు పొట్టలో అల్సర్లను మాన్పుతాయి.

* ఆర్థ్రయిటిస్‌: ఈ దుంపలోని మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌ ‘బి కాంప్లెక్స్‌’లు ఆర్థ్రయిటిస్‌ నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించిన నీటితో నొప్పిగా ఉన్న కీళ్ల మీద రుద్దినా ఫలితం ఉంటుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.