చర్మానికి చల్లని పూత

0
189

చర్మానికి చల్లని పూత

ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆ వేడికి చర్మం కమిలిపోవడం సహజం. ఇలాంటి సమయంలో చర్మానికి వేసుకునే పూతలు కూడా చల్లచల్లగా ఉంటేనే బాగుంటుంది. ఆలస్యం ఎందుకు కుదిరినప్పుడల్లా చందనంతో రకరకాల పూతలు ప్రయత్నించేద్దాం..!

* మూడు చెంచాల చందనంపొడిలో తగినంత గులాబీనీరు కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే ఎండవేడి నుంచి ముఖచర్మం పొడారిపోకుండా ఉంటుంది. ఈ పూత కంటికింద నల్లని వలయాల్ని కూడా పోగొడుతుంది.

* రెండు చెంచాల చందనంపొడీ, రెండు చెంచాల పసుపు, సరిపడా గోరువెచ్చని నీరు తీసుకుని అన్నింటినీ కలిపి ముద్దలా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖంపై నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి.

* రెండు చెంచాల చొప్పున చందనంపొడీ, ముల్తానీమట్టీ, తగినంత గులాబీనీరు తీసుకుని అన్నింటినీ కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత చల్లనినీటితో కడిగేయాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే పొడి చర్మం తాజాగా మారుతుంది.

* ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తరువాత వాతావరణంలోని వేడి వల్ల చర్మం నల్లగా మారుతుంది. దాన్ని పోగొట్టాలంటే నాలుగు చెంచాల చందనంపొడిలో సగం నిమ్మచెక్క రసాన్ని కలిపి ముద్దలా చేసుకుని ముఖం, మెడకూ రాసుకోవాలి. పావుగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. నలుపుగా మారిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి మారుతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచిది.

* చెంచా చొప్పున సెనగపిండీ, చందనంపొడీ, పసుపు తీసుకుని గులాబీనీటితో ముద్దలా కలపాలి. దీన్ని ముఖం, మెడకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేయాలి. ముఖచర్మం కాంతులీనుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.