గుంటూరు స్పెషల్ . పచ్చిమిరపకాయల కారం

0
219

గుంటూరు స్పెషల్ .

పచ్చిమిరపకాయల కారం.

కావలసినవి .

పచ్చిమిరపకాయలు — 100 గ్రాములు .
చింతపండు — నిమ్మకాయంత విడదీసి తడిపి ఉంచుకోవాలి.
ఉప్పు — తగినంత .
పసుపు — కొద్దిగా .
నూనె — నాలుగు స్పూన్లు

పోపునకు.

మెంతులు — అర స్పూను
చాయమినపప్పు — స్పూను
ఆవాలు — అర స్పూను
ఇంగువ — కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే పచ్చిమిరపకాయలు , పసుపు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలి .

తర్వాత వాటిని వేరే ప్లేటులో తీసుకోవాలి .

తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు మెంతులు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

తర్వాత మిక్సీలో మగ్గిన పచ్చిమిరపకాయలు , తడిపిన చింతపండు , తగినంత ఉప్పువేసి పచ్చడి బండతో మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .

తర్వాత వేగిన పోపు మిక్సీ లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి

కారంగా తినలేని వారు చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ వేసుకోండి .

ఈ పచ్చడి లో ఎండుమిరపకాయలు , కొత్తిమీర , కరివేపాకు వంటివి వేయరు .

చింతపండు సమంగా పడితే పచ్చడి నోరుమండి పోయే కారం ఉండదు .

అంతే ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు స్పెషల్ పచ్చిమిరపకాయల కారం ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి చెప్పనలవి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.