గరుడ పురాణం

0
156

శ్రీ గరుడ పురాణం అష్టాదశ (18) పురాణాల్లో ఒకటి.దీన్ని వ్యాస మహర్షి రచించాడు ఇందులో నరకము గురించి నరకలోకము లో విధించే శిక్షలు గురించి ఉంటుంది. కొంత మంది ఇళ్లల్లో పెట్టుకోకూడాదు,అశుభం అంటారు అలా అంటే మిగిలిన 17 పురాణాలు కూడా వ్యర్థం అన్నట్లే లెక్క……స్వయంగా శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి దీన్ని బోధించాడు….మనిషి చనిపోయినప్పుడే కాదు,ఇది నిత్య పఠన గ్రంధము

శ్రీ గరుడ పురాణం మొదటి అధ్యాయము (భాగాలు గా రోజు పోస్ట్లు)

శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి నరకం గురించి ఈ విధముగా వివరించాడు…..
వైనతేయా యమ మార్గం వినేవారికి కూడా భయం కలిగించేదే. ఎవరు పాపకార్యాసక్తులో,ఎవరు దయ ధర్మాలను విడనాడి సంచరిస్తారో,ఎవరు శాస్త్రాలను, సన్మార్గులని నిరసిస్తారో,ఎవరు వినయాశీలురు ఐశ్వర్యం చేత మదం కలిగి వర్తిస్తారో,కామం చేత ఎవరు పీడితులు అవుతారో వాళ్ళు నరకానికి పోతారు.
జ్ఞానవంతులు,శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు,పాపాత్ములు దుఃఖితులై యాతన పొందుతారు. వారు తాము లోగడ చేసిన పాపాపుణ్యముల ఫలితాన్ని విధిగా అనుభవిస్తారు. తరువాత కర్మయోగాన్ని అనుసరించి ఆధి వ్యాధులు అనుభవిస్తారు.ఇంత అయిన వారికి జీవితం మీద ఆశపోదు. ఈ సమయంలో మృత్యు స్వరూపం అయిన కాలము-సర్పము గమనించని రీతిలో ఇంట్లో చేరినట్లు దేహి కి సన్నిహితము అవుతుంది. పాపులు బ్రతికినన్త కాలం ఇహలోకం లో దుఃఖాలని, యమలోకం లో యమ భాదలని అనుభవిస్తారు

బాల్యం,యవ్వనం,నడిమి వయసు గడిచే వరకు పూర్వ పుణ్యం వల్ల సత్ఫలితాలు కలిగినా, వార్ధక్యంలో దుష్కృత్యాలకి ఫలితంగా వ్యాధులచే పీడింపబడతారు. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించాలి అనుకునేవారికి బలీయమైన కాల ప్రభావం చేత ఒకానొక సమయం మరణం తప్పదు.
ఆ మరణ సమయం లో.కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడని వాడై,భార్య బిడ్డల చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికి మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.పెట్టినది ఎదో తింటూ ఉంటాడు..

రోగం,మందాగ్ని,అల్పాహారం,అల్పగతి,చావు కల ప్రతిబింబించే కళ్ళు,శ్లేష్మం చేత బంధించబడిన నాడులు, ఆయాస భారం,చుట్టూ చేరిన బంధు జనం,కంఠం లో నుండి గురక వెలువడుతుంటే పలకడానికి గొంతు పెగలని హీనస్థితి లో కాలపాశ బద్ధుడై ఉంటాడు ఆ జీవి
చివరికి ఈ బంధు జనాన్ని వదిలి,అందరూ శోకిస్తూ ఉండగా ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడ చేరువలో ఉన్న యమకింకరులు ఆ జీవి ప్రాణాన్ని లాగేస్తారు. వేల కొద్దీ తేళ్లు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవి మరణిస్తాడు.ఆ సమయంలో శ్లేష్మం చొంగ బైటకు వస్తాయి.పాపాత్ములు అదోమార్గాన ప్రాణాలు పోతాయి.

దిగంబరులు,కాకుల్లా నల్లగా ఉన్న వాళ్ళు,వంకర మూతి గలవారు,కోపించిన కళ్ళు ఉన్న వారు,గోళ్లు ఆయుధంగా కలిగిన వారు,పైకి నిక్క బోడిచిన వెంట్రుకలు ఉన్న భయంకరమైన యమకింకరులు దండ పాశధారులై రాగా,వారిని చూచి భయం చేత జీవునికి మూత్ర పూరీషాలు అప్రయత్నంగా విసర్జింపబడతాయి. అంగుష్టం ప్రమాణం కలిగిన రూపం లోకి మారిన జీవుడు తన స్థూల శరీరం నుండి వెలువడి, తన ఇల్లు చూస్తూనే యమ భటుల చేత పట్టుకోబడతాడు (సశేషం)

హిందూ ధర్మ చక్రం

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.