కేసీఆర్ ను మంత్రిని చేయకపోవటం తప్పేనన్న బాబు

0
313

తెలుగు రాజకీయాలు చూస్తే ఒక పోలికను ప్రతిఒక్కరూ చేస్తుంటారు. రాష్ట్ర విభజనను విపరీతంగా వ్యతిరేకించేవారైతే.. రాష్ట్రం విడిపోవటానికి చంద్రబాబే కారణం అంటారు. అదెలా అంటే.. కేసీఆర్కు కానీ మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాబుతోనే ఉండేవారని.. బయటకు వెళ్లే వారు కాదని.. అదే జరిగితే టీఆర్ ఎస్ పార్టీ అనేది ఉండేది కాదని.. అప్పుడు రాష్ట్ర రాజకీయమే మరోలా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమర్థత.. దగ్గరతనం.. అన్ని ఉన్నా ఆ రోజున కేసీఆర్కు మంత్రి పదవిని బాబు ఎందుకు ఇవ్వలేదన్న విషయంపై అందరికి చాలానే ప్రశ్నలు ఉన్నాయి. మరి.. బాబును నేరుగా.. సూటిగా.. మీరు కానీ కేసీఆర్ ను మంత్రి పదవి కానీ ఇచ్చి ఉంటే రాష్ట్రం విడిపోయేదే కాదు కదా? అన్న ప్రశ్నను సంధిస్తే?  తాజాగా అలాంటి పనే చేసిందో మీడియా సంస్థ. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. సదరు మీడియా సంస్థ యజమాని బాబును సూటిగా ఈ ప్రశ్నను అడిగేశారు. దానికి బాబు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు.

ఇంతకీ బాబు చెప్పిందేమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. “కొన్ని క్యాలిక్యులేటెడ్ మిస్టేక్స్ చేస్తుంటాం.అలాంటిదే ఇది కూడా.  కొన్ని తప్పులను దిద్దుకోలేం. కేసీఆర్ నాతో చాలా బాగుండేవాడు. ఆయనకు వ్యతిరేకంగా కరణం రామచంద్రరావు ఉన్నప్పటికీ… సరిచేశాం. నిజానికి… మంత్రి పదవి విషయంలో కేసీఆర్ కంటే విజయరామారావు బెటర్ లీడర్ ఏమీ కాదు.  విజయరామారావు ఒక అధికారి మాత్రమే. కాకుంటే పీజేఆర్ ను ఓడించారన్న ఉద్దేశంతో పదవి ఇచ్చాం. కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందవు. అయితే.. ప్రతిదానికీ ఏదో అయిపోతుందనుకుంటే… ఏదీ చేయలేం. ఒక్కోసారి ‘జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్’ ఉంటుంది”  అని వ్యాఖ్యానించారు.

మొదట్లో ఫెరోషియస్ గా ఉన్న మీరు ఇప్పుడు సాఫ్ట్ అయ్యారన్న ప్రశ్నకు బదులిస్తూ.. పదవితో మనిషి స్వభావం మార్చుకోవాల్సి ఉంటుందని.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. సీఎంగా చేయలేమన్నారు. కంటికి కన్ను అనుకుంటూ పోతే అంతు ఉండదని.. అది జరగకూడదన్నారు. అందుకే తమ పార్టీ వాళ్లను చంపితే నిరసన వ్యక్తం చేశానే కానీ.. హత్యకు హత్యే సమాధానమని వెళ్లలేదన్నారు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.