కీరనీళ్లు… తాగి చూడండోసారి

0
270

కీరనీళ్లు… తాగి చూడండోసారి!

మన శరీరంలోని మలినాలను బయటకు పంపించడానికి చాలా మార్గాలే ఉంటాయి. కానీ వాటిలో అన్నింటికన్నా సులభమైన మార్గం కీరదోస నీళ్లు తాగడం. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

* ఇవి తయారు చేసుకోవడం కూడా సులువే. కీరను పలుచని ముక్కలుగా కోసి తాగే నీళ్లలో వేయాలి. అరగంటయ్యాక తాగొచ్చు. అయితే నీళ్లలో ముక్కలు మాత్రం ఒకరోజు కన్నా ఎక్కువ ఉంచకూడదు. కావాలంటే రుచి కోసం నిమ్మరసం కూడా కలపొచ్చు.

* ఈ నీళ్లు రోజూ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది. ఈ నీళ్లలోని కీరదోస ముక్కల్ని కూడా తినొచ్చు.

* దోసలో విటమిన్లూ, మినరళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

* బరువు తగ్గించడంలో ఈ నీటి పాత్ర మెండు. ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టనిండిన భావన వస్తుంది.

* ఈ నీటిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-కె, మాంసకృత్తులు… ఎముకలూ, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

* ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి మాంగనీసు, బీటాకెరోటిన్‌ గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.

* నోటి నుంచి దుర్వాసన వస్తుంటే ఈ నీళ్లను క్రమం తప్పకుండా తాగిచూడండి. నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపి ఈ సమస్య తగ్గు ముఖం పడుతుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.