కిడ్నీలో రాళ్ళను

0
568

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
కిడ్నీలో రాళ్ళను

*పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

Treatment for Gall Bladder or Kidney stones.

1 spoon కొండ పిండి ఆకుల పొడి *or* కొండ పిండి చెట్టు ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి , వడ బోసి త్రాగవలెను.

ఉదయం Breakfast తర్వాత మరియు రాత్రి భోజనం తర్వాత త్రాగవలెను.

గమనిక.. కొండ పిండి ఆకుల పొడి ఆయుర్వేధ షాపులో లభించును.

మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి
మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించా కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది.

బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది

గమనిక –

మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు.

కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ?

ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.

కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే..

* తులసి రసం: ముందుగా తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

* కొండపిండి కషాయం:

కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటిలో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30. మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడు పూటలా తీసుకోవాలి. లేదా కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకుని తినటం అలవాటు చేసుకోవాలి. మూడు నెలల్లో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

* ఉలవచారు:
కావలసినవి… ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

*వేపాకులు ఎండించికాల్చిన బూడిద స్పూన్ , ముల్లంగి రసంలో కలిపి త్రాగుతున్న రాళ్లు కరిగి పడిపోవును.

*మూత్రంలో రాళ్లు పోయేందుకు చిట్కాలు…*
***
వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును.
×. ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి 24 గ్రాములు లీటరు మజ్జిగలో క

లిపి త్రాగాలి.
× పెసరపప్పు అరకేజి గ్రామును లీటరు మంచినీళ్లలో కలిసి కాచిపైన తేరినకట్టు త్రాగుచుంటే రాళ్లు పడిపోవును.
× సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిసి సేవించిన రాళ్లు కరిగుతాయి

గాల్ బ్లాడర్ స్టోన్స్ ……ఆయుర్వేదం
***********************
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేద చికిత్సతో ఆ అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ సమస్య పునరావృతం కాదు.

ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతము పిత్తాశయంలో చేరి తన రూక్ష్మ గుణంచే పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తము తన పాకగుణంచే దీనిని ఒక రాయిలా తయారుచేయును. దీనిని పిత్తాశ్మరీ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొలెస్ట్రాల్ స్టోన్ . పైత్యరసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్‌ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకుని కొలెస్ట్రాల్‌ స్టోన్ గా మారుతుంది.

రెండవది ఫిగ్మెంటెడ్‌ స్టోన్‌. కాలేయంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలు నాశనం చేసేటప్పుడు (హీమోలైసిస్‌) బైలిరూబిన్‌ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నప్పుడు పిగ్మెంటెడ్‌ స్టోన్స్ ఏర్పడతాయి
ఈ పిత్తాశ్మరీ పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కుడివైపు పక్కటెముకల కింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు వీపు గూఢ భాగములోనికి పొడుస్తుంది. నొప్పి హఠాత్తుగా మొదలయి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు వస్తుంది. వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతి రావడం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాయి పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయంలోనే రాయి స్థిరంగా ఉంటే ఒక్క లక్షణం కనిపించదు.

అబ్డామిన్‌, రక్తపర

ీక్ష, అల్ట్రాసోనోగ్రఫీ అప్పర్‌ అబ్డామిన్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఎండోస్కోపిక్‌ రిట్రోగ్రేడ్‌ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ అనే నూతన పద్ధతి ద్వారా రాయి పరిమాణం, అదిఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు.

గాల్‌స్టోన్స్‌ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు లితోట్రిప్సీ అనే సర్జికల్‌ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయాన్ని తొలగించడం(కొలసిస్టెక్టమీ) చేస్తారు. ఈ విధంగా పిత్తాశయం తీసినవేసిన వారిలో అరుగుదల మందగించడం, కడుపు ఉబ్బరం, విరేచనాలు ఎక్కువ కావడం, కామెర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుని సరియైున నిర్ణయం తీసుకోవాలి.

ఆయుర్వేదంలో వాతాదిదోషాలు ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ కరిగిపపోయేలా చేయవచ్చు. శరీరంలో దోష సామ్యతను కలిగించడం ద్వారా గాల్‌స్టోన్స్‌ మళ్లీ మళ్లీ తయారుకాకుండా నివారించవచ్చు. ఆయుర్వేద చికిత్స ద్వారా పిత్తాశ్మరీని పూర్తిగా శాశ్వతంగా తగ్గించవచ్చు.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.