కర్ణుడుకి శక్తి ఎక్కువా లేక అర్జునుడికా ?

0
124

కర్ణుడుకి శక్తి ఎక్కువా లేక అర్జునుడికా ???

యుద్దరంగానికి అర్జునుడు , కర్ణుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరి మద్య యుద్ధం జరుగుతోంది . ఒకరి పైన మరొకరు అస్త్రాలు ప్రయోగిస్తున్నారు . ఎవ్వరు గెలుస్తారు ? అన్న విషయం అంతుపట్టడం లేదు . అర్జునుడి అస్త్రాలు కర్ణుడు , కర్ణుడి అస్త్రాలను అర్జునుడు కండిస్తున్నారు. అర్జునుడికి తాను అమితమైన శక్తీ గలవాడనే గర్వం వుంది . అది శ్రీకృష్ణుడికి ఎప్పటినుండో తెలుసు . కాని చెప్పడానికి సమయం దొరకక ఎదురు చూస్తున్నాడు . ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది .

అర్జునుడు వేసిన ఒక్క బాణం దాటికి కర్ణుడు రధం తో సహా మాయమయ్యాడు . ఆ బాణ ప్రభావానికి ఏమయ్యాడో , ఎన్ని లోకాల అవతల పడ్డాడో , ప్రాణం తో ఉన్నాడో లేడో, గాలిలో ధూలిలాగా కలసి పోయాడో అని అర్జునుడు మనసులో అనుకున్నాడు .ఆ పరమాత్ముడు ఐన అర్జునుడి రద సారధి కృష్ణుడికి అర్జునుడి మనసులో ఏముందో తెలియక పోతుందా ?సమయం కోసం వేచి చూస్తున్నాడు .

రెప్పపాటులో కర్ణుడు యుద్దరంగంలో రధం తో సహా వచ్చాడు . అది చూసి అర్జునుడు అచ్చార్యపడ్డాడు . కర్ణుడు మెరుపు వేగంతో అర్జునుడి పైన ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు . దాని దెబ్బకు అర్జునుడి రధం తో పాటు ఒక అడుగు వెనక్కి వెళ్ళింది . అప్పుడు క్రిషుడు పగలబడి నవ్వసాగాడు . ఎందుకు నవ్వుతున్నావ్ ? అతను నాకన్నా బలవంతుడు కాదు కదా అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు .అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు .

చూడు అర్జునా నీ బాణ ధాటికి ఆ కర్ణుడు ఎన్ని లోకాల అవతల పడ్డాడో కాని , అతడు వేసిన బాణానికి మన రదం ఒక అడుగు వెనక్కు వేల్లలేదా ? ఈ సృష్టికే దేవుడైన నేను రదం లో వుండగా ఒక అడుగు వెనక్కి నేట్టాడే , అదే నేను రధం లో లేకపోతే నువ్వు ఏమయ్యే వాడివో తెలుసా ? ఆలోచించు అని అన్నాడు . అప్పుడే అర్జునుడికి కర్ణుడు తనకంటే ఎంతో బలవంతుడని తెలిసింది . అతనికి తెలిసేలా చేసాడు శ్రీకృష్ణుడు .

ఇది చదివాక మీరు ఒప్పుకొంటారా ? అయితే మీ సమాదానం చెప్పండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.