కనకధారా స్తోత్రం

0
639

*ఓం నమః శివాయ*:
ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు చేసిన కనకధారా స్తోత్రం. దీనిని నిత్యం చదివితే లోటు లేని ఐశ్వర్యం మరియు జ్ఞాన సంపద లభిస్తుందని ఫలశృతి.

🚩

అంగ హరే: పులక భూషమాశ్రయంతీ!!

భ్రుంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్!!

అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా!!

మాంగల్యదాస్తు మమ మంగళదేవాతాయా!!

మొగ్గలతో నిండి వున్న చీకటి కానుగ(చెట్టు)కు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్టు, పులకాంకురాలతో వున్న శ్రీహరి శరీరాన్ని ఆశ్రహించినదీ, సకలైశ్వర్యాలకు స్తానమైనదీ అయిన లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు నాకు శభాలనే ప్రసాదించుగాక!

🚩

ముగ్ధా ముహుర్విదధతీ పదనే మురారే:!!

ప్రేమత్రపా ప్రణిహితాని గతగతాని,!!

మాలా దృశో: మధుకరీన మహోత్పలేయా!!

సామే శ్రియం దిశతు సాగర సంభవాయా!!

పెద్ద నల్ల కలువపై వుండే తుమ్మెదలా శ్రీ హరి ముఖంపై. ప్రేమ సిగ్గులతో ముందు వెనుకలకు ప్రసరిస్తున్న, సముద్ర తనయ లక్ష్మీ యొక్క కృపాకటాక్షము నాకు సంపదను అనుగ్రహించుగాక!

🚩

విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్ష!!

మానందహేతు రాధికం మురవిద్విషోపి!!

ఈషన్నిషీదతు మయి క్షనమీక్షణణార్ద!!

మిందీవరోదర సహోదర మిందిరాయా:!!

దేవేంద్ర పదవిని ఈయగలదీ, శ్రీ మహా విష్ణువు సంతోషానికి కారనమైనదీ. నల్లకలువలను పోలునదీ అయిన లక్ష్మీదేవి కటాక్షం కొంచెం నాపై ఉండుగాక!

🚩

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద!!

మానందకంద మనిమేష మనంగతంత్రమ్!!

అకేరక స్థిత కనీనిక పక్ష్మనేత్రం!!

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా!!

నిమీలిత నేత్రుడై, ఆనంద కారణుడైన శ్రీ మహావిష్ణువుని సంతోషములతో చూడడం వలన రెప్పపాటు లేనిదీ, కామ వశమైనదీ కుంచితమైన కనుపాపలతో రెప్పలతో శోభిల్లునదీ అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగు గాక!

🚩

కాలంబుదాలి లలితోరసి కైటభారే:!!

ధారా ధరే స్పురతి యాతటిదంగనేవ!!

మాతస్సమస్తజగతాం మహానీయ మూర్తి:!!

భద్రాణి మే దిశతు భార్గవనందనాయా!!

కారుమబ్బు మీద మెరుపుతీగలా, నీల మేఘ శ్యాముడైన నారాయణుని వక్షస్థలంపై ప్రకాశిస్తున్న ముల్లోకాల తల్లి భార్గవనందన అయిన లక్ష్మీదేవి నాకు శుభాములనిచ్చుగాక!

🚩

బాహ్యంతరే మరజితః శ్రిత కౌస్తుభే యా!!

హారావలీవ హరినీలమయీ విభాతి!!

కామప్రదా భగవతోపి కటాక్షమాలా!!

కల్యాణ మావహతు మే కమళాలయాయాః!!

భగవంతుడైన నారాయణునికి కామప్రదయై, అయన హృదయమందున్న కౌస్తుభమున ఇంద్రనీల మణిమయమైన హారావళివలె ప్రకాశిస్తున్న, కమలాలయ అయిన లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభములను చేకూర్చుగాక

🚩

ప్రాప్తం పద ప్రథమతః ఖాలు యత్ర్పభావత్!!

మాంగల్యభాజి మధుమాథిని మన్మదేన!

మయ్యాపతేత్తదిహ మంథరామీక్షణార్ధం!!

మందాలసం చ మకరాలయ కన్యకాయా!!

ఏ క్రీగంటి ప్రభావంతో మన్మధుడు మధుసూదనునియందు ముఖ్యస్థానమునాక్రమించేనో అట్టి క్షీరాబ్ధి కన్య అయిన లక్ష్మీ యొక్క చూపు నా యందు ప్రసరించుగాక!

🚩

దద్యాద్దయానుపనో ద్రవిణాంబుధారా!!

మస్మిన్నకించిన విహంగశిశౌ విషణ్ణేం!!

దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం!!

నారాయణప్రణయినీ నయనంబువాహః!!

శ్రీమన్నారాయణుని దేవియైన లక్ష్మిదేవి దృష్టి అనే మేఘం, దయ అనే వాయువుతో ప్రేరితమై, నాయందు చాలాకాలంగా వున్న దుష్కర్మ అనే తాపాన్ని తొలగించి, పేదవాడినన్న విచారంతో చాతకపు పక్షి వలెనున్న నాపై ధనవర్ష ధారను కురిపించుగాక!

🚩

ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ద్ర!!

దృష్టా స్త్రివిష్టస పదం సులభం భజంతే!!

దృషి: ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం!!

పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:!!

పద్మాసని లక్ష్మీదేవి దయార్ద్ర దృష్టివలెనే విశిష్టులైనవారు సులభంగా ఇంద్రపదవిని పొందుతున్నారు. వికసించిన పద్మంలా ప్రకాశించే ఆ దృష్టి. కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక!

🚩

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి!!

శాంకభరీతి శశిశేఖర వల్లభేతి!!

సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై!!

త తస్యై నమస్త్రి భువనైక గురోస్తరున్యై!!

వాగ్దేవ (సరస్వతి) అనీ, విష్ణు సుందరి అనీ, శాంకభారీ అనీ, శాశిరేఖవల్లభా అనీ పేరు పొందినదీ, సృష్టి, స్థితి లయముల గావించునదీ త్రిభువనాలకు గుర్వైన విష్ణువు యొక్క పట్టపురాణి అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

🚩

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై!!

రాత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై!!

శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై!!

పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై!!

పుణ్యకార్యాల ఫలము నొసగి శృతిరూపిణి, సౌందర్యగుణ సముద్ర అయిన రతి రూపిణి, పద్మనివాసిని అయిన శక్తి రూపిణి, నారాయణుని వల్లభా లక్ష్మిదేవికి నమస్కారమ్.!

🚩

నమోస్తు నాళీకవిబావనాయై!!

నమోస్తు దుగ్దోదధిజన్మ భూమ్మ్యై!!

నమోస్తు సోమామృతసోదరాయై!!

నమోస్తు నారాయణ వల్లభాయై!!

పద్మాన్ని బోలిన ముఖముగలదీ క్షీరసాగర తనయ, చంద్రునకు అమృతమునకు తోబుట్టువైనదీ, నారాయణపత్ని అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

🚩

నమోస్తు హేమంబుజపీఠికాయై!!

నమోస్తు భూమండలనాయకయై!!

నమోస్తు దేవాదిదయాపరాయై!!

నమోస్తు శార్ఘాయుధ వల్లభాయై!!

బంగారు పద్యం ఆసనంగా కలది. భూమండల నాయిక దేవతలను దయచూచునది, విష్ణుపత్నియైన లక్ష్మిదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యైభ్రుగునందనాయై నమోస్తు విష్ణోరరురస్థితాయై

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.