కందిపప్పు , పచ్చిశనగపప్పు మరియు చాయపెసరపప్పు మూడు కలిపిన పచ్చడి

0
617

కందిపప్పు , పచ్చిశనగపప్పు మరియు చాయపెసరపప్పు మూడు కలిపిన పచ్చడి .

కావలసినవి .

కందిపప్పు – ఒక కప్పు
పచ్చిశనగపప్పు – అర కప్పు
చాయపెసరపప్పు – పావు కప్పు
ఎండుమిరపకాయలు – 12
నూనె – మూడు స్పూన్లు
జీలకర్ర – ముప్పావు స్పూను
ఇంగువ – కొద్దిగా
చింతపండు – చిన్న నిమ్మకాయంత
పసుపు — కొద్దిగా
ఉప్పు – తగినంత

తయారీ విధానము .

ముందుగా చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే , ముందుగా కందిపప్పు , పచ్చిశనగపప్పు , ఎండుమిరపకాయలు మరియు జీలకర్రను వేసి పప్పును సగం వేగనివ్వాలి .

తర్వాత అందులో చాయపెసరపప్పు మరియు ఇంగువ వేసి పప్పులను పూర్తిగా కమ్మని వాసన వచ్చేదాకా వేగనివ్వాలి .

చల్లారగానే ముందుగా ఎండుమిరపకాయలు , పసుపు మరియు ఉప్పును వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి .

తర్వాత మిగిలిన పప్పులు మరియు తడిపిన చింతపండును వేసి , కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మెత్తగా రుబ్బుకోవాలి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .

ఇష్టమైన వారు స్టౌ మీద పోపు గరిటె పెట్టి , రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , చాయమినపప్పు అర స్పూను , ఆవాలు పావు స్పూను , కరివేపాకు రెండు రెమ్మలు తో పోపు పెట్టుకుని స్పూను తో కలుపు కోవాలి.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు, చపాతీలు , రోటీలు మరియు భోజనము లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.