ఆర్మీ జెనెరల్

0
163

1947 లో మనకు స్వాతంత్య్రం వచ్చింది కదా…

నెహ్రూ గారు ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు…

మీటింగ్ ఎందుకూ అంటే ఆర్మీ జెనెరల్ గా ఎవరిని నియమించాలి అనే విషయం చర్చించడానికి.

“మనకు సైన్యాన్ని నిర్వహించే నైపుణ్యం , అనుభవం ఇంతకు ముందు లేవు. కనుక కొన్నాళ్ల పాటు మనం ఒక బ్రిటిష్ ఆర్మీ జెనెరల్ ను కొన్నాళ్ళు నియమించుకుందాము. మీ అభిప్రాయాలను తెలియజేయండి.”

బ్రిటిష్ వారి సూచనలను పాటించడం అలవాటు అయిన వారు కనుక అందరూ తలలు ఊపేశారు…

అయితే Nathu Singh Rathore, అనే సీనియర్ ఆఫీసర్ లేచి “మీరు అనుమతి ఇస్తే ఒక విషయం చెప్తాను సర్” అన్నాడు,

నెహ్రూ ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.
తమాయించుకుని చెప్పండి ఆఫీసర్ అన్నాడు.

#Rathore ” మనకు దేశాన్ని పరిపాలించే అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మన దేశం లో లేరు సర్. కొన్నాళ్ల పాటు ఒక బ్రిటిష్ వ్యక్తిని మన ప్రధానిగా నియమించుకుంటే బాగుంటుందేమో సర్ ” అన్నాడు.

#ఒక్కరు కూడా కిమ్మంటే ఒట్టు?

#నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నెహ్రూ అన్నారు,

“General of The Indian Army గా మీరు ఉంటారా ?”
.

“సర్! మన ఆర్మీ లో నాకన్నా సీనియర్ , అద్భుత ప్రతిభ కల జనరల్ కరియప్ప గారు ఉన్నారు సర్.
వారు మా అందరిలోకీ వారే అర్హులు సర్”

ఆ విధంగా. Gen. Cariappa మన దేశపు మొదటి ఆర్మీ జనరల్ అయ్యారు…

(Many thanks to Lt. Gen Niranjan Malik PVSM (Retd) for this article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.