ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)

0
129

 

ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)
****(*****

ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభంలో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము. కానీ ఇదే  క్రానిక్‌ స్టేజ్‌ (దీర్ఘకాలం) లో మాత్రం కీళ్ళలో బిరుసుదనం (stiffness), వాపు బొత్తిగా కదల లేకపోవడం వంటి లక్షణాలు బాగా తెలియవస్తూంటాయి.. కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసుకుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

ఈ క్రింది కారణాలవలన ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయి

వాత-ప్రకోపం (అధికం అవ్వడం)

·  ఆమ (పూర్తిగా అరగని పదార్ధం)

·      ధిక మోతాదులో పులిసిన వాయువు వెళ్లి కీళ్ళల్లో నిలిచిపోవడం

ఎక్కువగా తినడం

·       పీల శరీర ఆకృతి

·         మలబద్ధకం వలన

·         అజీర్తి

నివారణ :

·         మలబద్ధకం లేకుండా చూసుకోవాలి

·         ఆమాన్ని పూర్తిగా తొలగించుకోవాలి

చిట్కాలు

·         నిమ్మకాయ రసం, తేనె  ఒక గ్లాసుడు నీళ్లలో రోజుకు రెండు సార్లు తీసుకోవడం

·         వంకాయని బాగా కాల్చి గుజ్జుకు ఆవనూనెతో పాటు జీలకర్ర, పసుపు, వెల్లుల్లి ఉప్పు వేసి రోజుకు రెండుసార్లుతీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది.

·         ఒక గ్లాసుడు నీళ్లలో 1 పెద్ద చంచా పసుపు శొంఠి కలిపి త్రాగాలి

·         ఒక వెల్లుల్లి రెక్కను పచ్చిగా పరగడుపున తినాలి

·         నువ్వుల నూనెలో కర్పూరం నిమ్మరసం వేసి నొప్పు ఉన్నచోట మర్దన చేయటం వల్ల మంచి ఫలితం ఇస్తుంది.

యోగరాజగుగ్గులు వీటి
తో పాటు కొబ్బరినీళ్ళు, బీట్రూట్‌ రసం, కారెట్‌ రసం త్రాగడం, అలాగే గుమ్మడి కాయని తరచూ తీసుకోవడం, అట్లానే జీలకర్ర, వెల్లుల్లి కూడా చాలా సహాయపడుతుంది.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.