ఆందోళన వద్దు… చంద్రగ్రహణం రోజు ఇలా చేయండి

0
425

ఆందోళన వద్దు… చంద్రగ్రహణం రోజు ఇలా చేయండి
—————++————-+++————-+++——–
ఈనెల 27 వ, తేదీ శుక్రవారం నాడు గురు పౌర్ణమే
కాక సంపూర్ణ చంద్ర గ్రహణం అన్న విషయం అందరికీ విదితమే! అయితే మకర,కుంభ,మిధున ,తులారాశుల వారికి అథమఫలితాలు అని, మేషం, వృషభరాశి, కన్యరాశి, మీనరాశి వారికి ఉత్తమ ఫలితాలు అని, మిగతా రాశుల వారికి మధ్యమ ఫలాలు అని ఇలా ఎవరి
శాస్త్ర పరిజ్ఞానం మేరకు వారు సూచనలు చెయ్యడం జరుగుతోంది. అయితే ఇంతవరకుశాస్త్ర పరిజ్ఞానం మేరకు వారు సూచనలు చెయ్యడం జరుగుతోంది. అయితే ఇంతవరకు
బాగానే ఉంది కాని ఇది నూటికి నూరు శాతం
యదార్థం అనుకోలేం… పంచాంగం ల్లో, వివిధ
టి వి ఛానల్స్ రాశి ఫలితాలు కార్యక్రమాల్లో
ఒక విషయం స్పష్టం చేస్తారు “ఈ ఫలితాలు యదాతధం గా తీసుకోనవసరం లేదు వ్యక్తిగత
జాతకం బట్టి ఫలితాలు మారుతాయి అనీ” మరి
అలాంటప్పుడు ఆయా రాశుల వారి పై అందరికీ
ఇప్పుడు మాత్రం ఒకే తరహా ఫలితాలు ఎందుకు
ఉంటాయి? కనుక అథమ ఫలితాలు అన్న రాశుల
వారు బెదరనవసరం, ఉత్తమ ఫలితాలు అన్నవారు
మురియనవసరం లేదు. అలాగే ఈ దోషాలు 150రూ లకే పోగడుతాం అనే వారు, జపాలు,
హోమాలు, దానాలు అంటూ భయపెట్టేవారు,
సరే డబ్బు ఉన్న వారు ఏవోపాట్లు పడతారు
అనుకుందాం! మరి లేని వాళ్ళు.. వారికి దోష
ప్రక్షాళన లేదా? లేకుంటే ఆ రాశుల్లో వీరు
జన్మించరా? కావున అనవసరపు భయాలు
ఎవరూ పెట్టుకోవద్దు… మన వ్యక్తిగత జాతకం,
ప్రారబ్ధకర్మలు బట్టే గ్రహణ ప్రభావం ఉంటుంది
తప్పా పూర్తి గా రాశుల బట్టి మాత్రం కాదు, ఆత్మ
విశ్వాసం, భగవంతుడు మనకు ఏవిధంగా చెడు
చెయ్యడు అని నిష్కల్మషమైన భావంతో గ్రహణాన్ని
విక్షీంచిన కూడా ఏమంత భయపడనవసరం లేదు,
ఒక వేళ దాన ధర్మాలు చెయ్యగలిగే స్తోమత మనకు
ఉంటే పూర్తి పేద వారికి సహాయం /దానం చెయ్యండి వంద రెట్లు పుణ్యం వస్తుంది.
అనుమానం తో మనం ఏమి చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది..
అయితే ఏది ఏమి అనుకున్నా ఎవరికి ఉండే భయం వారికి ఉంటుంది.. ఈ గ్రహణం మనకు
ఎటువంటి చెడు చేస్తుందో? అని తలపోసే వారు
ఉంటారు… అందుకే అందరూ సులభంగా ఆచరించ
తగినవి, ఎక్కువ ఖర్చు కానివి.. మన ఋషులు
మనకు అందించిన నివారణోపాయాలని మీకు
తెలియచెయ్యడం జరుగుతోంది.. ఇవన్నీ మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
గ్రహణంరోజు ఉదయం, రాత్రి రెండు పూటల
స్నానం చెయ్యండి.. ఆ చేసేటప్పుడు ఆ నీటి లో
ఆవుపాలు లేదా మాములుపచ్చి పాలు, గంధం,
ఉంటే ముత్యం, శంఖం (ఈ రెండు మళ్ళి వాడుకోవచ్చు) ఒక తులసి ఆకు వేసి చెయ్యండి
అలాగే గ్రహణానంతర స్నానం కుడా ఇలానే
చెయ్యండి.. “ఓం సోమాయ సోమనాధాయ నమః ” ఈ మంత్రం 10 సార్లు చదువుకోండి.
గ్రహణానికీ గంట ముందు లేదా గ్రహణ సమయం లో 108 లేదా వీలు అయినన్ని సార్లు
ఈ కింది మంత్రాలు చదువుకోండి
1)మేషరాశి :ఓం అంగారక మహీపుత్రాయ నమః
2) వృషభరాశి :ఓం నమో భార్గవాయ నమః
3)మిధున రాశి :ఓం నమోభగవతే వాసుదేవాయ నమః

4)కర్కాటక రాశి :ఓం సోమాయ సోమనాధాయ నమః
5)సింహరాశి :-ఓం సూర్యాయ సర్వ పాప హరాయ నమః
6)కన్యారాశి:- ఓం శ్రీం లక్ష్మిగణేశాయ నమః
7)తులారాశి :- ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఇంద్రాణి యే నమః
8)వృశ్చికరాశి :- ఓం శరవణ భవశరవణభవ సుబ్రహ్మణ్య స్వామిణే నమః
9)ధనస్సు రాశి :- ఓం ఐం హ్రీం క్లీం గురవే దత్తాత్రేయాయ నమః
10)మకరరాశి :- ఓం ఆంజనేయాయ మహాబలాయ హరిమర్కట మర్కటాయ నమః
11)కుంభ రాశి :- ఓం ధూం ధూం ధూమ వతి స్వాహా
12)మీన రాశి:ఓం హూం జుం భం కాలభైరవాయ నమః
గర్భిణులు చదవ వలసిన శ్లోకం
******************************************
దేవకీసుతం గోవింద వాసుదేవ జగత్పే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః
దేవ దేవ జగన్నాధ గోత్ర వృధ్ధి కరప్రభో
దేహి మే తనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం!

గ్రహణ స్పర్శ :రాత్రి :-11-54ని లకు↵సంపూర్ణ స్ధితి :రాత్రి :-01-01ని కు↵గ్రహణ మధ్య కాలం:రాత్రి :-01- 52ని కు↵గ్రహణ విడుపు :రాత్రి :-02-43ని కు↵ముగింపు లేదా మోక్ష కాలం :రాత్రి :-03 – 49 ని కు
విష్ణుప్రియ అస్ట్రో & రెమిడిస్ వరల్డ్
7093434284, 7396305057

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.