అశ్వగంధ చూర్ణం యొక్క అద్భుత ఉపయోగాలు

0
443

అశ్వగంధ చూర్ణం యొక్క అద్భుత ఉపయోగాలు –
***********
* చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .

* దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో “samniferin ” అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించి శక్తినిచ్చును

* జీర్ణక్రియ మీద దీని
ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును.

* పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును .

* విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.

* రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి

* వీర్యదోషాలకు ,వీర్య వృద్ధికి కూడా మంచి మందుగా పనిచేయును .

* శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును .

* శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును .

* వాతం , కీళ్లనొప్పులు ,వీపునొప్పి, నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి.

* థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .

* మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు .

* తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం ,నీరసంగా ఉన్నవారు, ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .

* గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .

* స్త్రీల వీపు,నడుము నొప్పులు,కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , ఎర్రబట్ట,అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.

* చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును .

* క్షయవ్యాధి , పోలియో వ్యాధికి ,అన్ని వ్యాధులలో కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు .

* ఇది మంచి రసాయనిక ఔషదం ప్రతి ఒక్కరు తప్పకుండా వాడుకోవలసిన ఔషదం ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ ఔషదాన్ని వాడటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి , నరాలకు సత్తువ పెరుగును .

గమినిక –

సరి అయిన పద్దతుల్లో శుద్ది చేసినటు వంటి అశ్వగంధ చూర్ణంని మాత్రమే వాడవలెను . ఈ అశ్వగంధని నాటుఆవుపాలతో శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే సరైన ఫలితాలు ఇస్తుంది. మొత్తం 11 సార్లు నాటు ఆవుపాలతో శుద్ది చేయవలెను . మంచి అనుభవ వైద్యుల సహాయంతో అశ్వగంధ చూర్ణాన్ని తయారుచేయించుకొని వాడుకోగలరు.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.