అధిక  ఋతు రక్త స్రావం

0
363

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician.9949363498

అధిక  ఋతు రక్త స్రావం
****************************
1.       4 వ రోజు ఉదయం రక్త స్రావం ఆగకపోతే మెత్తగా మగ్గిన అరటి పండు ఒకటి,నాటు ఆవు లేదా గేదె నెయ్యి50 గ్రాములు కలిపి బాగా పిసికి బహిష్టు అయిన యువతిని  పడుకోబెట్టి తలను  పైకి లేపి కొంచెం  కొంచెం గా మెల్లగా తినిపించాలి.ఆ విధంగా మూడు పూటలా భోజనానికి
ఒక గంట ముందు ఇవ్వాలి.

2. రెండు కప్పుల నీటిలో ఒక స్పూను దంచిన ధనియాలను వేసి మరిగించి అరకప్పుకు తగ్గించి ఆహారానికి ముందు మూడు పూటలా ఇవ్వాలి.

3. పిరుదుల కింద దిండు పెట్టుకొని కాళ్ళు కొంచం పైకి ఉండేట్లు పడుకో బెట్టాలి.

4.పలుచని నూలు గుడ్డ నీళ్ళలో పిండి నాలుగు మడతలు వేసి పొత్తి కడుపు మీద వెయ్యాలి..తడి గుడ్డను  గోచీగా పెట్టాలి.15 నిమిషాలు మాత్రమే ఉంచాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చెయ్యాలి.ఆ విధంగా చేసినపుడు దుప్పటికప్పాలి.
అల్ప ఋతు రక్త స్రావం — నివారణ                                       TableLampకుబ్లూకలర్ పలుచని కాగితాన్నిచుట్టి లైట్ వెలిగించాలి. ఆ నీలి రంగు కిరణాలు
పొట్ట మీద   పడేటట్లు చేయాలి.
2.  ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి దానికి నీలి రంగు కాగితాన్ని చుట్టి ఎండలో పెట్టాలి. కొంతసేపు అలాగే వుంచి  ఆ నీటిని తాగాలి.  ఈ విధంగా 4,5 గ్లాసుల నీటిని తాగాలి.

3. ఉదరాకర్షణ ఆసనం వెయ్యాలి.

సక్రమమైన ఋతు స్రావానికి

1. నాలుగైదు కిలోల పాత బియ్యాన్ని రాత్రి నానబెట్టి ఉదయం నీళ్ళు వంచేసి  బాగా ఎండబెట్టాలి.బాణలి స్టవ్ మీద పెట్టి కొంచం కొంచంగా బియ్యం వేస్తూ వేయించాలి . తరువాత రవ్వ పట్టించాలి. ఆ రవ్వతో ఉప్మా గాని అన్నం గాని వండుకొని తినాలి.

2. 32 ఎండు ద్రాక్ష పండ్లను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయం వాటిని తిని ఆ నీళ్ళు తాగాలి.   లేదా

3. ఎండుద్రాక్షను పేస్ట్ చేసి ప్రతి రోజు ఉదయం పది గ్రాముల ముద్ద తినాలి.

అధిక ఋతుస్రావం సమస్య –నివారణ

1. అరటి పువ్వు దంచి తీసిన రసం        — 5 gr
పెరుగు    — తగినంత

రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి.  తప్పకుండ ఆగిపోతుంది.

2. బూడిదగుమ్మడి రసం— 100 gr
పచ్చి పాలు — 100 gr

రెండింటిని కలిపి  ఉదయం, సాయంత్రం తాగితే తగ్గుతుంది.

3.  రాత్రి పూట చంద్రుడు ఉదయించిన తరువాత   వికసించిన కలువపూలను తెచ్చి  ఎండబెట్టి దంచి పొడితయారు చేసుకోవాలి.

కలువపూల పొడి  —100 gr
జిలకర పొడి    —- 100 gr
రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని 50 గ్రాముల వెన్నతో కలిపి సేవించాలి.  ఇది అతివేదిని అణచివేస్తుంది
అధికఋతు శ్రావ సమయంలోఎక్కువగా  నడవ కూడదు  తూర్పుకు ఎదురుగా కూర్చోవాలి. కుడిముక్కుమూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి  తరువాత  ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతోవాలి వదలాలి.

శీతలీ ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, శాంతిశయనాసనం  చెయ్యాలి.
అధిక ఋతు రక్త స్రావం — నివారణ
కారణాలు;–  మానసిక మైన కారణాలు,   బహిష్టు ముందుగా రావడానికి, ఆలస్యంగా రావడానికి ముందుగా  మాత్రలు  వాడడం  మొదలైనవి.   దీని వలన అధిక ఋతు స్రావం, నడుము నొప్పి, మొదలైన సమస్యలు ఏర్పడతాయి.

బోలా ( రక్త bolaa ) :— దీని కాండం మీద గాటు పెడితే వచ్చే రసాన్ని ఎండబెట్టి చూర్ణం చేయాలి.
ప్రతి రోజు రెండు, మూడు గ్రాముల పొడిని మజ్జిగతో తీసుకోవాలి.
దీనిని వాడడం వలన 35,  40 సంవత్సరాల వాళ్లకు ఎలాంటి సమస్యలు రావు. ప్రతి నిత్యం వాడుకోవచ్చు.   సాధారణమైన జీవితం గడుపుకోవచ్చు.

మేనోరేజియా (అధిక ఋతు రక్త స్రావం) –చికిత్స
3 నుండి 7  రోజుల వరకు  ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ వుండడం, 15 రోజుల వరకు ఆగకుండా వుండడం,  నెల మధ్యలోనే బహిష్టు రావడం, మొదలైన లక్షణాలను మేనోరేజియా
అంటారు.

ఇది హార్మోన్లలో తేడాల వలన, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, రక్తం పలుచబడడం  మొదలైనవి.

స్త్రీ ప్రసవించిన తరువాత, అబార్షన్ తరువాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఒక్కో సారి అది   కొనసాగుతూ వుంటుంది(కంటిన్యు  అవుతుంది) దీని వలన శరీరంలోరక్తం తగ్గి ఎనీమిక్ గా తయారవుతారు.

దీనిని యోగా, మెడిటేషన్, వేకువ జామున నడక మొదలైనవి చెయ్యడం వలన కొంత వరకు కంట్రోల్ చెయ్య
వచ్చు.  వేడి చేసే పదార్ధాలను మానెయ్యాలి. , కారం, పులుపుల వాడకం బాగా తగ్గించాలి.

దానిమ్మ పూల పొడి
మాజో
ధనియాల పొడి
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తేనెతో వాడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.