అద్భుత సినీగీతాల గానవర్షిణి పి. లీల (19-05-1934 & 31-10-2005)

0
532

అద్భుత సినీగీతాల గానవర్షిణి పి. లీల (19-05-1934 & 31-10-2005)

నేడు శ్రీమతి పి లీల గారి 85 వ జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు:

పి.లీల ( పొరయత్తు లీల ), ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. లీల మే 19, 1934లో కేరళలో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించేరు. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందేరు.ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడేరు.

జన్మించింది కేరళ రాష్ట్రంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్ కంపెనీ సరస్వతి స్టోర్స్ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.

ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభం అయింది. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్, సుబ్బరామన్, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, టి.వి.రాజు, ఎస్.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.

తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నారు. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.

సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.

లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించారు. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యుకు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.

ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింది.

తెలుగులో పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ, జయ సిం హ, చిరంజీవులు, మాయా బజార్, వినాయక చవితి, సారంగధర, అప్పు చేసి పప్పు కూడు, బాల నాగమ్మ, పాండురంగ మహాత్మ్యం, దక్ష యజ్ఞం, దీపావళి, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కధ, లవకుశ, సీతా రామ కల్యాణం, రాజమకుటం, గుండమ్మకథ, మహా మంత్రి తిమ్మరసు, బభ్రువాహన, పాండవ వనవాసం , పరమానందయ్య శిష్యుల కధ, తదితర సినిమాల్లో ఆమె పాడిన కొన్ని పాటలు గుర్తు చేసుకుందాము.

1. ఎంత ఘాటు ప్రేమయో, పింగళి, ఘంటసాల, పాతాళ భైరవి 1951, ఎన్ టి ఆర్, మాలతి

2. కలవరమాయె మదిలో,పింగళి, ఘంటసాల, పాతాళ భైరవి 1951 , ఎన్ టి ఆర్, మాలతి,

3. తీయని ఊహలు , పింగళి, ఘంటసాల, పాతాళ భైరవి 1951 , ఎన్ టి ఆర్, మాలతి,

4. హయిగా మనకింక స్వేచ్ఛగా, పింగళి, ఘంటసాల, పాతాళ భైరవి 1951 , ఎన్ టి ఆర్, మాలతి,

5. ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరా, పెళ్ళి చేసి చూడు 1952, పింగళి, ఘంటసాల, ఎన్ టి ఆర్, జి వర లక్ష్మి.

6. ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు, పెళ్ళి చేసి చూడు 1952, పింగళి, ఘంటసాల, ఎన్ టి ఆర్, జి వర లక్ష్మి.

7. ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా, మిస్సమ్మ 1955, పింగళి, ఎస్ రాజేశ్వర రావు, ఎన్ టి ఆర్, సావిత్రి.

8. తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరము, మిస్సమ్మ 1955, పింగళి, ఎస్ రాజేశ్వర రావు, ఎన్ టి ఆర్, సావిత్రి.

9. రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా, మిస్సమ్మ 1955, పింగళి, ఎస్ రాజేశ్వర రావు, సి కృష్ణ వేణి, సావిత్రి.

10. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, మిస్సమ్మ 1955, పింగళి, ఎస్ రాజేశ్వర రావు, ఏ ఎం రాజా, ఎన్ టి ఆర్, సావిత్రి.

11. ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక, చిరంజీవులు 1956, మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

12. అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి, చిరంజీవులు 1956, మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

13. ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే, చిరంజీవులు 1956,మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

14. కనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైన, చిరంజీవులు 1956, మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

15. చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు, చిరంజీవులు 1956, మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

16. తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా, చిరంజీవులు 1956, మల్లాది, ఘంటసాల, ఎన్ టి ఆర్, జమున

17. లాహిరి లాహిరి లాహిరిలో, మాయా బజార్ 1957, ఘంటసాల, పింగళీ

18. విన్నావటమ్మా ఓ యశోదమ్మా, మాయా బజార్ 1957, ఘంటసాల, పింగళి, సుశీల, స్వర్ణ లత, లీల

19.కలనైనా నీ వలపే, శాంతి నివాసం, సముద్రాల, ఘంటసాల, కాంతారావు, కృష్ణ కుమారి

20.కల్యాణ వైభోగమీనాడే, శ్రీ వేంకటేశ్వర మహాత్యం, పెండ్యాల, ఎన్ టి ఆర్, సావిత్రి

21. జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి, సారంగధర 1957, ఘంటసాల, సముద్రాల సీనియర్

22. ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పై, అప్పు చేసి పప్పు కూడు 1959, ఘంటసాల, ఎస్ రాజేశ్వర రావు, పింగళి, ఎన్ టి ఆర్, సావిత్రి.

23. సడి సేయకో గాలి, రాజ మకుటం 1960, దేవులపల్లి , మాస్టర్ వేణు, ఎన్ టి ఆర్, రాజ సులోచన.

24. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా, జగదేక వీరుని కధ 1961, పింగళి, పెండ్యాల, సుశీల, లీల, ఎన్ టి ఆర్, బి సరోజాదేవి

25. ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర, సీతా రామ కల్యాణం 1961, సముద్రాల సీనియర్, ఘంటసాల, గాలిపెంచల

26. వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను, గుండమ్మ కధ 1962, పింగళి, ఘంటసాల, ఎన్ టి ఆర్, సావిత్రి

27. జయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగా, మహా మంత్రి తిమ్మరసు 1962, పింగళి, పెండ్యాల, ఎన్ టి ఆర్, ఎల్ విజయ లక్ష్మి.

28. జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

29. రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

30. రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

31. లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

32. వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

33. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా, లవకుశ 1963, సముద్రాల, ఘంటసాల,

34. ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా, బభ్రువాహన 1964, సముద్రాల, పామర్తి,

35. ఈ నాటి ఈ హాయి, జయ సిం హ 1955, సముద్రాల, టీ వీ రాజు, ఘంటసాల, ఎన్ టి ఆర్, అంజలి.

36. అన్నానా భామిని, సారంగధర 1957, సముద్రాల, ఘంటసాల, ఎన్ టి ఆర్, రాజసులోచన

37. ఆనందం పరమానందం, అప్పు చేసి పప్పు కూడు 1959, ఎస్ రాజేశ్వర రావు, ఘంటసాల, పింగళి, ఎన్ టి ఆర్, ఎస్ వి ఆర్, సావిత్రి

38. ఊరేది పేరేది, రాజ మకుటం 1961, బాలాంత్రపు రజనీకాంతరావు, మాస్టర్ వేణు, ఘంటసాల, ఎన్ టి ఆర్, రాజ సులోచన

39. ఏడనున్నాడో, రాజ మకుటం 1961, మాస్టర్ వేణు, ఎన్ టి ఆర్, రాజ సులోచన

40. కాలం కాని కాలంలో, అప్పు చేసి పప్పు కూడు 1959, ఎస్ రాజేశ్వర రావు, పింగళి

41. చిలిపి కృష్ణునితోటి, వారసత్వం 1964, ఘంటసాల, ఎన్ టి ఆర్

42. దేవా దీనబాంధవా, పాండవ వన వాసం 1965, సముద్రాల, ఘంటసాల, ఎన్ టి ఆర్, ఎస్ వి ఆర్, సావిత్రి

43. నవ్వుల నదిలో పువ్వుల పడవ, మర్మ యోగి 1963,

44. మది ఉయ్యాలలూగే, భలే అమ్మాయిలు 1957

45. రామ రామ శరణం, అప్పు చేసి పప్పు కూడు, పింగళి, ఎస్ రాజేశ్వర రావు

46. సుందరాంగులను చూచిన వేళ, అప్పు చేసి పప్పు కూడు 1959, పింగళి, ఎస్ రాజేశ్వర రావు, ఎన్ టి ఆర్, జగ్గయ్య, సావిత్రి

47. స్వాగతం , శ్రీ కృష్ణ పాండవీయం 1966, సి నా రె, టీ వీ రాజు, ఎన్ టి ఆర్

48. వన్నెల చిన్నెలనెర, పాండురంగ మహాత్మ్యం 1957, సముద్రాల, టీ వీ రాజు, ఎన్ టి ఆర్, అంజలి.

49. తధాస్థు స్వాముల కొలవండి, మహా మంత్రి తిమ్మరసు 1962, పింగళి, పెండ్యాల, ఎన్ టి ఆర్

50. పూవై విరిసిన పున్నమి వేళా, తిరుపతమ్మ కధ 1962, సి నా రె, పామర్తి.

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.